Telugu Updates
Logo
Natyam ad

కారు బోల్తా, ఐదుగురికి గాయాలు..!

నిర్మల్ జిల్లా: సోన్ మండలంలోని కడ్తాల్ గ్రామ బైపాస్ వద్ద బుధవారం తెల్లవారుజామున ప్రమాదవశాత్తు కారు బోల్తా పడి ఐదుగురు వ్యక్తులకు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు తెలిపిన కథనం ప్రకారం. కర్నాటక రాష్ట్రానికి చెందిన వారు (KA 03MN6777) నంబర్ గల సిప్టు కారులో హైదరాబాద్ వైపు వెళ్తున్నారు. ఒక్కసారిగా కారు జాతీయ రహదారిపై నుండి సర్వీస్ రోడ్డు వైపు పల్టికొట్టింది. ఈ ప్రమాదంలో ఐదుగురికి తీవ్రగాయాలయ్యాయి. వెంటనే స్థానికులు 108, జాతీయ రహదారి అంబులెన్స్ కు సమాచారం అందించారు.

క్షతగాత్రులను చికిత్స నిమిత్తం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఘటన స్థలాన్ని ఎస్సై సంతోషం రవీందర్ పరిశీలించారు.