Telugu Updates
Logo
Natyam ad

ప్రజల పక్షాన ఉంటా.. తప్పులు చేసే వారికి మద్దతు ఇవ్వను

మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు

ఆంజనేయులు న్యూస్, మంచిర్యాల జిల్లా: టీబీజీకేఎస్ నాయకుడు ఢీకొండ భవనం అక్రమ నిర్మాణం కావడం వల్లే అధికారులు కూల్చివేశారని ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు తెలిపారు. సోమవారం మంచిర్యాలలో మీడియాతో మాట్లాడుతూ.. మాజీ ఎమ్మెల్యే దివాకర్ రావు చేస్తున్న అసత్య ప్రచారాన్ని ప్రజలు విశ్వసించరని పేర్కొన్నారు. బీఆర్ఎస్  ప్రభుత్వ హయాంలోనే భవనం ప్రభుత్వ భూమిలో ఉందని అప్పటి తహసీల్దార్ నోటీసులు జారీ చేసారని అప్పుడు ఎందుకు చర్యలు తీసుకోలేదని ఎమ్మెల్యే ప్రశ్నించారు. బీఆర్ఎస్ నేతల అక్రమాలకు దివాకర్ రావు కొమ్ముకాషారని ఆరోపించారు. మున్సిపల్ లో ఉద్యోగాలు పెట్టిస్తానని కౌన్సిలర్ హరికృష్ణ డబ్బులు తీసుకుని పని పెట్టించక పొగ డబ్బులు తిరిగి ఇవ్వలేదని అందుకే బాధితులు పోలీసులకు ఫిర్యాదులు చేస్తే చర్యలు తీసుకున్నారన్నారు.

బేర సత్యనారాయణ పై అనేక ఫిర్యాదులు ఉండగా బాధితుల పక్షాన నిలవకపోగా దివాకర్ రావు రోడ్లపై ఆందోళన చేయడం శోచనీయమని అన్నారు. లక్సెట్టిపేట లో ముత్తె సత్తయ్య, దండేపల్లి లో హరినాయక్ అనే బిఆరెస్, బీజేపీ నాయకులు భూ ఆక్రమణలకు పాల్పడ్డారని అభియోగించారు.  ఎవరు తప్పు చేసిన చట్టపరమైన చర్యలు ఉంటాయని, తాను ప్రజల పక్షాన ఉంటాను తప్ప తప్పులు చేసే వారికి మద్దతు ఇవ్వనని స్పష్టం చేశారు. మంచిర్యాలలో ట్రాఫిక్ నియంత్రణ, ప్రజల సౌకర్యం కోసం కొంత కఠిన నిర్ణయాలు తీసుకోకతప్పడం లేదన్నారు.
• మాతా, శిశు ఆసుపత్రికి అనుమతి
మంచిర్యాల ఐబీ స్థలంలో మాతా శిశు ఆసుపత్రి నిర్మాణంకు ప్రభుత్వం అనుమతి ఇచ్చిందని ప్రేమ్ సాగర్ రావు తెలిపారు. కొద్దీ రోజుల్లో నిర్మాణం పనులు చేపడు తామని ఆయన పేర్కొన్నారు.