Telugu Updates
Logo
mobile after logo

బాలికల భద్రతే లక్ష్యం.. షీ టీమ్స్ అవగాహన సదస్సు

 వేధింపులపై నిర్భయంగా ఫిర్యాదు చేయాలి: ఎస్‌ఐ ఉషారాణి

ఆంజనేయులు న్యూస్, మంచిర్యాల జిల్లా: మహిళల భద్రతే లక్ష్యంగా రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలో షీ టీమ్స్ అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తున్నాయి. రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా, ఐపీఎస్ (డీఐజీ) ఆదేశాలు, మంచిర్యాల డీసీపీ భాస్కర్, ఐపీఎస్ పర్యవేక్షణలో మంచిర్యాల జిల్లా షీ టీమ్ ఎస్‌ఐ ఉషారాణి ఆధ్వర్యంలో ఆదివారం మంచిర్యాలలోని మాతాశ్రీ గర్ల్స్ హాస్టల్‌లో ప్రత్యేక అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్‌ఐ ఉషారాణి మాట్లాడుతూ మహిళలు, బాలికలు ఎలాంటి వేధింపులు ఎదురైనా భయపడకుండా వెంటనే షీ టీమ్స్‌ను ఆశ్రయించాలని సూచించారు. ఈవ్ టీజింగ్, స్టాకింగ్, సోషల్ మీడియా వేధింపులు వంటి ఘటనలపై నిర్భయంగా ఫిర్యాదు చేయాలని, ఫిర్యాదు చేసిన వారి వివరాలు పూర్తిగా గోప్యంగా ఉంచుతామని తెలిపారు. షీ టీమ్ సిబ్బంది కానిస్టేబుళ్లు జ్యోతి, సతీష్ మాట్లాడుతూ కళాశాలలు, బహిరంగ ప్రదేశాలు, వసతి గృహాల పరిసరాల్లో వేధింపులను అరికట్టేందుకు షీ టీమ్స్ సభ్యులు సాధారణ దుస్తుల్లో నిరంతరం నిఘా నిర్వహిస్తున్నట్లు వివరించారు. అలాగే సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని, T-Safe యాప్ వినియోగంపై విద్యార్థినులకు అవగాహన కల్పించారు. వేధింపులు ఎదురైనప్పుడు రామగుండం షీ టీమ్ నంబర్ 6303923700, మంచిర్యాల షీ టీమ్ నంబర్ 8712659385, అత్యవసర సేవల కోసం 100, సైబర్ నేరాల ఫిర్యాదుల కోసం 1930 హెల్ప్‌లైన్‌ను సంప్రదించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో షీ టీమ్ సిబ్బంది జ్యోతి, సతీష్, మాతాశ్రీ గర్ల్స్ హాస్టల్ నిర్వాహకులు మహేందర్, గణేష్‌తో పాటు హాస్టల్‌లోని విద్యార్థినులు పాల్గొన్నారు.

Post bottom