ఎస్ఐ ఇద్దరు కానిస్టేబుళ్ల పై వేటు..!
ఆసిఫాబాద్ జిల్లా: కాగజ్నగర్ టౌన్ లో విధులు నిర్వహిస్తున్న ఎస్సైతో పాటు ఇద్దరు కానిస్టేబుళ్లను జిల్లా ఉన్నతాధికారులు ఎస్పీ ఆఫీస్ కు అటాచ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసినట్లు సమాచారం. ఎస్సై, ఇద్దరు కానిస్టేబుళ్లకు మధ్య మట్కా, ఇతర కేసుల్లో ముడుపుల పంపకం విషయంలో తీవ్రస్థాయిలో గొడవలు జరిగినట్లు తెలుస్తోంది. ఈ వ్యవహారం జిల్లా పోలీస్ ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లడంతో వారిని ఎస్పీ కార్యాలయానికి అటాచ్ చేసి, విచారణ ప్రారంభించినట్లు సమాచారం.
ఈ విషయమై కాగజ్ నగర్ డీఎస్పీ ఎ. కరుణాకర్ ను సంప్రదించగా అటాచ్ చేసిన విషయం వాస్తవమేనని, మిగతా వివరాలు తెలియరాలేదన్నారు.