Telugu Updates
Logo
Natyam ad

నన్ను గెలిపించండి.. నిరుద్యోగులకు అండగా ఉంటా

పట్ట భద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి ప్రచారానికి విశేష స్పందన 

నిరుద్యోగులకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించేందుకు కృషి చేస్తా

పట్ట భద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి ప్రసన్న హరికృష్ణ

ఆంజనేయులు న్యూస్, ఉమ్మడి అదిలాబాద్ జిల్లా: రాష్ట్రంలో నిరుద్యోగులకు అండగా నిలువడానికి సేవకుడుగా పని చేసేందుకు పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా బరిలో ఉంటున్నానని కరీంనగర్, ఆదిలాబాద్, మెదక్, నిజామాబాద్ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి ప్రసన్న హరికృష్ణ అన్నారు. శుక్రవారం మంచిర్యాల పట్టణంలోని ప్రభుత్వ మోడల్ స్కూల్ ఉపాధ్యాయులను కలిసి వారి సమస్యలను స్వయంగా తెలుసుకున్నారు. గ్రంథాలయంలో గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ గ్రూప్ ఫోర్ విద్యార్థులకు ఉచితంగా కరెంట్ అఫైర్స్ పుస్తకాలను అందజేశారు.. ఈ సందర్భంగా హరికృష్ణ మాట్లాడాతూ.. ప్రతి గ్రామంలో ప్రతి మండలంలో గ్రంథాలయాలు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని తెలిపారు. అలాగే భవిష్యత్తులో తాను జాబ్ క్యాలెండర్ సక్రమంగా ఉండే విధంగా చూస్తానని హామీ ఇచ్చారు.

విద్యార్థులందరి నుండి మంచి స్పందన లభించిందని రాబోయే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో గ్రాడ్యుయేషన్ పూర్తయిన వారు తప్పకుండా ఓటు హక్కు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. నిరుద్యోగులకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించేందుకు కృషి చేస్తానని తెలిపారు. సెప్టెంబర్ 30 నుంచి నెల రోజులపాటు ఆన్ లైన్ లో ధరఖాస్తు చేసుకోవాలని పేర్కొన్నారు. 2021 కి ముందు గ్రాడ్యుయేషన్ పూర్తయిన వారు అర్హులు అని అన్నారు. ఇప్పటికీ హెచ్ఎం లు పదోన్నతులు లేక 18 ఏళ్లుగా హెచ్ ఎం లుగా ఉన్నారని, మండల విద్యా అధికారుల ఖాళీలు భర్తీ చేయక పోవడంతో సమస్య మరింత జటిలం అయిందని అన్నారు.1998 నాటి డిఎస్సీ అభ్యర్థులు నన్ను కలవడం జరిగిందని, ఇంకో 3 ఏళ్లు దాటితే వయోపరిమితి దాటి అనర్హులుగా మిగిలి పోవలసి వస్తుందని వాపోయారని అన్నారు.

ఎయిడెడ్ పాఠశాలల్లో ఉపాద్యాయులు వేతనాలు రాకపోవడంతో ఆందోళన వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. మంచిర్యాల పట్టణంలో ఉన్న కోర్టు భవనం సైతం ఇంకా అద్దె భవనాల్లో కొనసాగడం దూరదృష్ట కరణమన్నారు. ఇప్పటివరకు చాలా మంది నాయకులు రాజకీయ భవిష్యత్తు కోసం పనిచేశారని, కాని నేను మాత్రం ఒక సేవకుడుగా పనిచేస్తానని పట్ట భద్రులకు భరోసా ఇచ్చారు. నన్ను అందరించండి మీ అండగా నేనూంటని అని అన్నారు.

అనంతరం మాజీ మున్సిపల్ చైర్ పర్సన్ ముఖేష్ గౌడ్, న్యాయవాది రాజేష్ గౌడ్, సీఐ రాజమౌళి గౌడ్, లతో కలిసి సమావేశం నిర్వహించారు. అనంతరం వారు శాలువలతో సత్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో న్యాయవాది కొట్టే నటేశ్వర్ బోడకుంట నవీన్, నిహాల్ ముత్యం సుధాకర్, తదితరులు పాల్గొన్నారు.