Telugu Updates
Logo
Natyam ad

రోడ్డు ప్రమాదంలో పాత్రికేయునికి తీవ్ర గాయాలు

ఆర్థిక సహాయం కోసం ఎదురు చూపులు

ఆంజనేయులు న్యూస్, నిర్మల్ జిల్లా: జిల్లాలో సారంగాపూర్ మండలానికి చెందిన పాత్రికేయుడు రామచంద్ర గౌడ్ ఆదివారం విధి నిర్వహణలో వెళ్లిన క్రమంలో రోడ్డు ప్రమాదానికి గురై తీవ్ర గాయాలపాలయ్యాడు. తలకు బలమైన గాయాలు కావడంతో చికిత్స కోసం ఆస్పత్రిలో అపస్మారక స్థితిలో ఉన్నాడు. అతని ఆరోగ్య పరిస్థితి తిరిగి సాధారణ స్థితికి రావాలంటే తక్షణ ఆపరేషన్ అవసరమని వైద్యులు తెలిపారు. ఇందుకు సుమారు రూ.10 లక్షల వరకు వ్యయం అవుతుందని తెలిపారు.
రామచంద్ర గౌడ్ పేద కుటుంబానికి చెందినవాడు కావడంతో ఇంత పెద్ద మొత్తాన్ని సమకూర్చడం వారికి కష్టంగా మారింది. మానవతావాదులు, దాతలు ఆర్థిక సహాయాన్ని అందించాలని కుటుంబ సభ్యులు కోరుతున్నారు. వారికి తోచినంత మొత్తాన్ని 8885013554కు గూగుల్ పే, ఫోన్ పే ద్వారా ఆర్థిక సహాయం అందించాలని కుటుంబ సబ్యులు విజ్ఞాప్తి చేస్తున్నారు.