ఆల్ఫోర్స్ పాఠశాలల చైర్మన్ డాక్టర్ వి నరేందర్ రెడ్డి ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలను ఘనంగా నిర్వహించారు.
ఆంజనేయులు న్యూస్, మంచిర్యాల జిల్లా: జిల్లా కేంద్రంలోని స్థానిక బైపాస్ రోడ్ లో గల ఆల్ఫోర్స్ పాఠశాల ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలను మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రిన్సిపాల్ రాజమణి మాట్లాడుతూ.. పండుగలు మత సామరస్యానికి ప్రతీకలని, ఐక్యతకు నిదర్శనమని అన్నారు.
సహజ సిద్ధంగా దొరికే రంగురంగుల పూలతో బతుకమ్మను నిర్వహిస్తారని, సాంస్కృతిక చిహ్నం అని తొమ్మిది రోజుల పూల సంబరం తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయాలకు ప్రతీకగా నిలిచేది బతుకమ్మ పండుగ అన్నారు. తెలంగాణ ప్రభుత్వం బతుకమ్మను ఎంతో ప్రతిష్టాత్మకంగా రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తోందని ప్రిన్సిపల్ అన్నారు.
అనంతరం బతుకమ్మ పండుగ విశిష్టతను విద్యార్థులకు తెలియజేశారు. విద్యార్థిని విద్యార్థులు, మహిళా ఉపాధ్యాయులు పాల్గొని రంగురంగుల పూలతో బతుకమ్మను పేర్చి ఆటపాటలతో అలరింప చేశారు. అనంతరం విద్యార్థులకు మిఠాయిలు అందించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్ తో పాటు ఉపాధ్యాయులు, మహిళా ఉపాధ్యాయులు, పాఠశాల సిబ్బంది, పేరెంట్స్ కమిటీ తదితరులు పాల్గొన్నారు.