మంచిర్యాల జిల్లా: మంచిర్యాల మున్సిపాలిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వైకుంఠ రథంను ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మున్సిపల్ నిధులు రూ. 18 లక్షల వ్యయంతో వైకుంఠ రథం కొనుగోలు చేసినట్లు తెలిపారు. మున్సిపల్ పరిధిలో పేదలు మృతి చెందితే మృతదేహాలను శ్మశానవాటికలకు ఉచితంగా తరలించేందుకు వాహనం దోహదపడుతుందన్నారు. దీనిని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ పెంట రాజయ్య, వైస్ చైర్మన్ గాజుల ముకేష్ గౌడ్, మున్సిపల్ కమిషనర్ బాలకృష్ణ, కౌన్సిలర్లు పాల్గొన్నారు.