Telugu Updates
Logo
Natyam ad

ఆసుపత్రి భవనాన్ని ఢీ కొట్టిన హెలికాప్టర్.. నలుగురు మృతి

ఓ అంబులెన్స్ హెలికాప్టర్ కుప్పకూలిన ఘటనలో నలుగురు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన తుర్కియేలో చోటుచేసుకుంది.

ఆంజనేయులు న్యూస్: తుర్కియేలో విషాదం చోటుచేసుకుంది. వైద్యులతో బయలుదేరిన ఓ అంబులెన్స్ హెలికాప్టర్ ప్రమాదానికి గురయ్యింది. ఆసుపత్రి భవనాన్ని ఢీకొట్టి కుప్పకూలింది. ఈ ఘటనలో ఇద్దరు పైలట్లు సహా మొత్తం నలుగురు మృతి చెందారు. తుర్కియేలోని అంతల్యా ప్రావిన్సులో ఉన్న ఓ రోగిని ఆసుపత్రికి తీసుకువచ్చేందుకు ముగ్లా ట్రైనింగ్ అండ్ రీసెర్చ్ హాస్పిటల్ వైద్య బృందం హెలీకాప్టర్ లో  బయలుదేరింది. ఇద్దరు పైలట్లు, ఓ వైద్యుడు, మరో వైద్య సహాయకుడు అందులో ఉన్నారు. హెలికాప్టర్ టేకాఫ్ అవుతున్న క్రమంలో ఆసుపత్రి నాలుగో అంతస్తును ఢీకొట్టి.. నేలకూలింది. దాంతో అందులో ఉన్న నలుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. దట్టమైన పొగమంచు కారణంగానే ఈ ప్రమాదం జరిగినట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలినట్లు సమాచారం. ఆసుపత్రి భవనం బయట హెలికాప్టర్ శకలాలు చెల్లాచెదురుగా పడిపోయాయి.