Telugu Updates
Logo
Natyam ad

అల్ఫోర్స్ పాఠశాలలో ముందస్తు క్రిస్మస్‌ వేడుకలు

ప్రత్యేక దుస్తుల్లో ఆకట్టుకున్న చిన్నారులు

అలరించిన సాంస్కృతిక కార్యక్రమాలు

ఆంజనేయులు న్యూస్, మంచిర్యాల జిల్లా:  జిల్లాలో పలు విద్యాసంస్థలు, కార్యాలయాల్లో ముందస్తు క్రిస్మస్‌ సంబురాలు నిర్వహించారు.. జిల్లా కేంద్రంలోని స్థానిక బైపాస్ రోడ్ లో గల ఆల్ఫోర్స్ పాఠశాల చైర్మన్ డాక్టర్ వి. నరేందర్ రెడ్డి ఆదేశానుసారం పాఠశాల ప్రిన్సిపల్ ఆధ్వర్యంలో ముందస్తు క్రిస్మస్‌ సంబురాలు సోమవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రిన్సిపాల్ రాజమణి మాట్లాడుతూ.. పండుగలు మత సామరస్యానికి ప్రతీకలని, ఐక్యతకు నిదర్శనమని అన్నారు. క్రిస్మస్‌ విశిష్టతను, జీసస్‌ జీవిత విశేషాలను ప్రిన్సిపాల్‌ విద్యార్థులకు తెలియజేశారు. విద్యార్థులకు క్రిస్మస్‌ చెట్టు తయారీ, చిత్రలేఖనం పోటీలు నిర్వహించారు. అనంతరం పాటలు పాడుతూ, నృత్యాలు చేస్తూ సందడి చేశారు. క్రిస్మస్‌ విశిష్టత తెలిసేలా విద్యార్థులు చేసిన సాంస్కృతిక ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. మేరి, శాంతాక్లాజ్‌, షెపర్డ్‌, వైజ్‌ మ్యాన్‌ వేషధారణలో పిల్లల ప్రదర్శనలు అలరించాయని తెలిపారు.. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్ తో పాటు ఉపాధ్యాయులు, మహిళా ఉపాధ్యాయులు, పాఠశాల సిబ్బంది, పేరెంట్స్ కమిటీ తదితరులు పాల్గొన్నారు.