Telugu Updates
Logo
Natyam ad

దివ్యాంగుల అభ్యున్నతికి రాష్ట్ర ప్రభుత్వం కృషి

మంచిర్యాల జిల్లా: జిల్లా  కేంద్రంలోని కలెక్టరేట్ ఆవరణలో మంగళవారం దివ్యాంగులకు ఉపకారణాలను ప్రభుత్వ విప్ బాల్క సుమన్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా దివ్యాంగులకు ఆయన వాహనాలు, ల్యాప్ టాప్ లను అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం దివ్యాంగుల అభ్యున్నతికి కృషి చేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య, రాష్ట్ర వికలాంగుల సహకార సంస్థ ఛైర్మన్ వాసుదేవ రెడ్డి, జడ్పీ చైర్ పర్సన్ నల్లాల భాగ్య లక్ష్మి, కలెక్టర్ భారతీ హోలికెరీ, గ్రంధాలయ సంస్థ ఛైర్మెన్ రేణికుంట్ల ప్రవీణ్, తదితరులు పాల్గొన్నారు..