మంచిర్యాల జిల్లా: చెన్నూరు నియోజకవర్గంలో అభివృద్ధి పనులపై మంగళవారం రాష్ట్ర ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బాల్క సుమన్ సమీక్ష సమావేశం నిర్వహించారు. జైపూర్ లోని ఎస్టీపీపీలో ఏర్పాటు చేసిన సమావేశంలో నియోజకవర్గ పరిధిలో ప్రధాన రహదారులు, సెంట్రల్ లైటింగ్, జంక్షన్ల అభివృద్ధి తదితర అంశాలపై ఆయన సమీక్షించారు. ఈ సమావేశంలో హెచ్ కే ఆర్, ఎన్ హెచ్ 63, రోడ్లు, భవనాల శాఖ అధికారులు పాల్గొన్నారు..