Telugu Updates
Logo
mobile after logo

విమానం కిందకు దూసుకెళ్లిన కారు..!

దిల్లీ: దేశ రాజధాని దిల్లీ విమానాశ్రయంలో త్రుటిలో ప్రమాదం తప్పింది. ఎయిర్ పోర్ట్ లో నిలిపి ఉంచిన ఇండిగో విమానం కిందకు గోఫస్ట్ ఎయిర్లైన్ కు చెందిన ఓ కారు దూసుకెళ్లింది. విమానం ముందు చక్రాల వరకు కారు వెళ్లిందని, కొద్దిలో విమానాన్ని ఢీకొట్టే ప్రమాదం తప్పిందని సంబంధిత వర్గాలు తెలిపాయి.

విమానం మంగళవారం ఉదయం ఢిల్లీ నుంచి పట్నాకు బయల్దేరాల్సి ఉంది. ఈ క్రమంలోనే కారు దూసుకొచ్చిందని అధికారులు తెలిపారు. అయితే విమానం షెడ్యూల్ ప్రకారమే పట్నాకు బయలుదేరిందన్నారు.

Post bottom