
హైదరాబాద్: టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పై కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.. హైదరాబాద్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. “సోనియా, వైఎస్సార్ ను తిట్టిన దరిద్రుడు రేవంత్ రెడ్డి. జైలుకు వెళ్లొచ్చిన నువ్వా నాకు చెప్పేది. కాంట్రాక్ట్ కోసమే పార్టీ మారినట్టు నిరూపించగలవా. నువ్వు వ్యాపారాలు చేయనిదే ఈ స్థాయికి వచ్చినవా. కాంట్రాక్టు కోసమే మారినట్టు నిరూపిస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటా. లేదంటే నువ్వు పీసీసీకి రాజీనామా చేస్తావా. రేవంత్ రెడ్డి ఓ బ్లాక్ మెయిలర్. పీసీసీ అయ్యాక ఇంటికి వస్తా అంటే నా ఇల్లు మలిన అవుతుందని వద్దన్నా. నువ్వు ఉన్నది మూడు ఫీట్లు. ఎవరిని తొక్కుతవు నువ్వు. మునుగోడుకు నువ్వు వస్తే డిపాజిట్ కూడా రాదు.
నువ్వు ఇప్పటికి చంద్రబాబు డైరెక్షన్ లో పని చేస్తున్నావు. చంచాగాళ్లతో డబ్బులిచ్చి జిందాబాద్ కొట్టించుకుంటున్నావు. నీకు సిగ్గు, శరం, ఉంటే నిరూపించు. నువ్వో దొంగవు. నీ చిట్టా అంతా బయటపెడుతాం. కాంగ్రెస్ లో చాలా మంది అసంతృప్తులున్నారు. వెంకట్ రెడ్డి, జగ్గారెడ్డి సంతోషంగా ఉన్నారా.” అని రాజగోపాల్ రెడ్డి ఫైర్ అయ్యారు

