Telugu Updates
Logo
mobile after logo

ఎస్సై పై కత్తులతో దాడి..?

గాయాల పాలైన ఎస్సై వినయ్

దగ్గరలోని ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించిన తోటి పోలీసులు

వైద్యం చేసిన డాక్టర్లు ప్రాణాలకు ఎలాంటి ఇబ్బంది లేదని, అవుటాఫ్ డేంజర్ అని చెప్పారు.

హైదరాబాద్: ట్రాఫిక్ పోలీస్ తన విధులను సక్రమంగా నిర్వర్తించినందుకు ఆయన మీదే దాడి జరిగింది. నంబర్ ప్లేట్ లేదని ఓ వాహనాన్ని ఆపేందుకు ట్రాఫిక్ ఎస్సై ప్రయత్నించగా, ఆ వాహనదారుడు ఏకంగా ఎస్సై పైనే కత్తితో దాడి చేశాడు. సికింద్రాబాద్ మారేడ్ పల్లి లోని ఓం శాంతి హోటల్ వద్ద అర్ధ రాత్రి సమయంలో ఈ ఘటన జరిగింది. చేయి చాచి వాహనం ఆపుతుండగా, డ్రైవర్ కత్తితో దాడి చేశాడు. దీంతో ఎస్సైకి కడుపు, వెన్ను భాగంలో బాగా గాయాలు అయ్యాయి. దీంతో గాయాల పాలైన ఎస్సై వినయ్ ని దగ్గరలోని ప్రైవేట్ ఆస్పత్రిలో వెంటనే తోటి పోలీసులు చేర్పించారు.

వైద్యం చేసిన డాక్టర్లు ప్రాణాలకు ఎలాంటి ఇబ్బంది లేదని, అవుటాఫ్ డేంజర్ అని చెప్పారు. అయితే, దాడికి పాల్పడిన ఇద్దరు వ్యక్తులపై పోలీసులు ఫోకస్ పెట్టగా, ఇద్దరు యాప్రాల్ ప్రాంతానికి చెందిన టమాటా పవన్, సంజయ్ గా గుర్తించారు. పరారీలో ఉన్న ఇద్దరి కోసం నార్త్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు గాలిస్తున్నారు. వీరు పీడీ యాక్ట్‌ ఉందని, గతంలో చాలా సార్లు జైలుకు వెళ్లి వచ్చారని తేల్చారు. 

Post bottom