Telugu Updates
Logo
Natyam ad

సైబర్ నేరగాళ్ల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి..!

రామగుండం సీపీ ఎస్ చంద్రశేఖర్ రెడ్డీ

రామగుండం పొలిస్ కమిషనరేట్: ప్రజలు సైబర్ నేరగాళ్లు చూపే మోసపూరిత ఆశలకు గురికావద్దు. సైబర్ దొంగలు డబ్బు దోచేస్తే వెంటనే టోల్ ఫ్రీ నెంబర్ 1930 కు కాల్ చేయండి. NCRP portal (www. cybercrime. gov. in) లో ఫిర్యాదు చేస్తే సంబంధిత పోలీస్ స్టేషన్ వారు తక్షణమే స్పందిస్తారని శనివారం రామగుండము పోలీస్ కమీషనర్ ఎస్ చంద్రశేఖర్ రెడ్డి ఐపిఎస్.. (ఐజి) ఒక ప్రకటనలో తెలిపారు. కంప్యూటర్, స్మార్ట్ ఫోన్ ల వాడకం పెరుగుతున్న కొద్దీ సైబర్ నేరాలు పెరుగుతున్నాయి. తెలియని నెంబర్ నుంచి వాట్సాప్ లో కానీ ఇంస్టాగ్రామ్ లో కానీ ఫేస్బుక్లో కానీ వీడియో కాల్ చేసి ఫోటో లను న్యూడ్ ఫోటో లుగా మార్ఫింగ్ చేసి మీ బంధువులకి ఫోన్ చేస్తాం, ఫోటోలు పంపిస్తాం, యు ట్యూబ్ లో అప్లోడ్ చేస్తాం. అంటూ ఇబ్బంది పెడుతున్నారు. పార్ట్ టైం జాబ్ ఇస్తామని, లాటరీ వచ్చింది అనో, గిఫ్ట్ వచ్చిందనో, కేవైసి అప్డేట్ చేయాలని చెప్పి సైబర్ నేరగాళ్లు పర్సనల్ డీటెయిల్స్ తీసుకొని డబ్బు కాజేస్తున్నారు. మరికొందరు క్రెడిట్ కార్డు డీటెయిల్స్ దొంగిలించి అందులోని డబ్బును వాడుకుంటున్నారు. ఆన్లైన్ సైబర్ నేరగాళ్ల మోసాల్లో పడకుండా అప్రమత్తంగా ఉండాలని సిపి పేర్కోన్నారు.