మంచిర్యాల జిల్లా: రాష్ట్ర ప్రభుత్వం పెంచిన ఆర్టీసి టికెట్, విద్యార్ధుల బస్ పాస్ చార్జీలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేస్తూ శనివారం బిజెపి ఆధ్వర్యంలో మంచిర్యాల బస్ డిపో ఎదుట ధర్నా నిర్వహించారు. అనంతరం పెంచిన ఆర్టీసీ చార్జీలను వెంటనే తగ్గించాలని, కార్మికుల సమస్యలు వెంటనే పరిష్కరించాలని డిపో మేనేజర్ కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా బీజేపీ జిల్లా అధ్యక్షుడు రఘునాథ్ మాట్లాడుతూ టిఆర్ఎస్ ప్రభుత్వం రెండు నెలల వ్యవధిలో ఆర్టీసీ ఛార్జీలు రెండు సార్లు పెంచి పేద ప్రజలను దోచుకుంటుందని ఆరోపించారు. కేంద్ర పెట్రోల్, డీజిల్ రేట్లు తగ్గించి పేద ప్రజలకు ఊరట కలిగిస్తే రాష్ట్ర ప్రభుత్వం మాత్రం పెట్రోల్, డీజిల్ పై విధిస్తున్న వ్యాట్ తగ్గించకుండా సెస్ పేరుతో ఆర్టీసీ చార్జీలను పెంచడం శోచనీయం అన్నారు. విద్యార్థుల బస్సు పాస్ ఛార్జీలు 250 శాతానికి పెంచడంతో పేద విద్యార్థుల కుటుంబాల తీవ్ర ఆర్థిక భారం పడుతుందని ఆయన తెలిపారు. వెంటనే పెంచిన ఆర్టీసీ బస్సు ఛార్జీలు, విద్యార్థుల బస్ పాస్ చార్జీలను తగ్గించి, కార్మికుల సమస్యలు పరిష్కరించాలని ఆయన డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు బోయిని హరికృష్ణ, గాజుల ప్రభాకర్, పోనుగోటి రంగరావు, మున్న రాజా సిసోడియా, కర్ణ శ్రీధర్ ఆకుల సంతోష్, సోమ ప్రదీప్ చంద్ర, మాసు రజిని, బియ్యాల సతీష్ రావు, జోగుల శ్రీదేవి, పట్టి వెంకట కృష్ణ, బొద్దున మల్లేష్, బుద్దరపు రాజమౌలి, ముదాం మల్లేష్, మడిపెళ్ళి సత్యం, అమిరిషెట్టి రాజు, రెడ్డిమళ్ల అశోక్, కుర్రే చక్రి, రాకేష్ రెన్వా, తదితరులు పాల్గొన్నారు.