Telugu Updates
Logo
Natyam ad

తిరుపతిలో అలరించిన జిల్లా కూచిపూడి కళాకారుల ప్రతిభ

“అయోధ్యరామునికి అలరించిన నాట్యనీరాజనం”

తిరుపతి లో అవార్డు అందుకుంటున్న మంచిర్యాల జిల్లా శ్రీ నందిని నృత్యాలయం శిష్య బృందం

ఆంజనేయులు న్యూస్, మంచిర్యాల జిల్లా: భారతీయ శాస్త్రీయ సంప్రదాయ నృత్యాలన్నీ దేవుళ్లను ఆరాధిస్తూ కొనసాగుతాయి. అందుకే ఆయా అంశాలకు కళాకారులు పలికించే భావాల్లో ఆ భగవంతున్ని సాక్షాత్కరిస్తాడని వక్తలన్నారు. ప్రైడ్ ఇండియ కల్చరల్స్ మరియు సిటిజెన్స్ వెల్ఫేర్ ఫోరం సంయుక్త అధ్యక్షులు డాక్టర్॥ కోల వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో రెండు రోజుల పాటు జరిగే ప్రతిష్ఠాత్మక అంతర్జాతీయ స్థాయి నృత్యోత్సవం “అయోధ్యరామునికి నాట్య నీరాజనం” ఆదివారం తిరుపతి మహతి ఆడిటోరియం” లో అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా దేశ నలుమూలలనుంచి వివిధ రాష్ట్రాలకు చెందిన కళాకారులు చక్కటి అంశాలను ప్రదర్శించి ప్రేక్షకులను మెప్పించారు. భారతీయ సాంస్కృతిక వైభవాన్ని చాటిచెప్పారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా “డాక్టర్ వేదాంతం రాదేశ్యాం మాస్టర్, డాక్టర్ పశుమతి శేశుబాబు యక్షగాన కంటేరవ్ సంగీత నాట్యచార్య, దేవేంద్ర పీల్లై ప్రముఖ భరత నాట్య గురువు, ప్రభావతి తిరుపతి మ్యూజిక్ డాన్స్ కాలేజీ ప్రిన్సిపాల్, హాజరయ్యారు.. ఈ నాట్యోత్సవంలో మంచిర్యాల జిల్లా నుండి శ్రీ నందిని నృత్యాలయం ఫౌండర్, గురువు, నేషనల్ లెవెల్ డా॥ ఏపీజే అబ్దుల్ కలాం ఎక్స్ లెన్స్ అవార్డు గ్రహీత నాట్య విభూషణి శ్రీ డేగ కల్పన గారి శిష్య బృందం అలోఖి, సాధిక, హర్షిత, మనస్వి, ఓజెస్వి, కూచిపూడి నాట్య ప్రదర్శనలు చేసి ప్రేక్షకులను అబ్బురపరిచారు వారి ప్రతిభ కు గాను “అయోధ్య రామ అవార్డ్ ఆఫ్ ఎక్స్ లెన్స్” అవార్డుతోపాటు సర్టిఫికెట్ మెడలు, బ్యాడ్జీలు ప్రధానం చేశారు. అనంతరం గురువుకి అయోధ్య రామ అవార్డ్ ఆఫ్ ఎక్స్ లెన్స్” అవార్డుతో ఘనంగా సన్మానించారు.