Telugu Updates
Logo
Natyam ad

తనపై అసత్య ఆరోపణలు చేస్తే సహించేది లేదు..!

మాజీ ఎమ్మెల్సీ, ఏఐసీసీ సభ్యులు కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు

మంచిర్యాల జిల్లా: తనపై అసత్య ఆరోపణలు చేస్తే సహించేది లేదంటూ ఎమ్మెల్యే నడిపల్లి దివాకర్ రావు కు మాజీ ఎమ్మెల్సీ, ఏఐసీసీ సభ్యులు కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు హెచ్చరిక చేశారు. ఆదివారం ఆయన తన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. ఎమ్మెల్యే దివాకర్ రావు తప్పుడు ప్రచారాలు చేస్తూ తన పరువుకు భంగం కలిగిస్తున్నారని అన్నారు. ఇకముందు తనపై అసత్య ఆరోపణలు చేస్తే ఎమ్మెల్యే పై వంద కోట్ల రూపాయల కు పరువు నష్టం దావా కేసు ను కోర్టులో దావా వేస్తానని ఆయన తెలిపారు. అలాగే తన తాబేదార్లు తన కిందిస్థాయి క్యాడర్ తో తన పై సోషల్ మీడియాలో, సభలు, సమావేశాల్లో తప్పుడు ప్రచారాలు చేయిస్తే వారిపై కూడా 10 కోట్ల రూపాయలకు దావా వేస్తానని ఆయన హెచ్చరించారు. ఎవరి జీవితం ఏమిటో ప్రజలకు బాగా తెలుసు అని ఆయన అన్నారు. తాను కష్టపడి వ్యాపార రంగంలో అంచెలంచెలుగా ఎదిగానని ఎమ్మెల్యే దివాకర్ రావు లాగా తప్పుడు వ్యవహారాలు చేస్తూ ఎమ్మెల్యేగానే ఒకసారి ఎదగలేదని ఆయన తెలిపారు.  తన పర్సనల్ వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడం ఇప్పటికైనా మానుకోవాలని ఎమ్మెల్యేకు ఆయన సూచించారు. లేదా వేదిక తేదీ నిర్ణయిస్తే తాను ఒంటరిగా చర్చకు రావడానికి సిద్ధంగా ఉన్నానని నీవు అవసరమైతే మందిని తీసుకొని రావాలని మేధావులైన పాత్రికేయులు సమక్షంలో ఎవరు ఎలాంటి వారో చర్చకు పెడతామని ఆయన సవాల్ విసిరారు..

ఒకవేళ నాదే తప్పు నేనే ప్రజలకు వ్యతిరేకమని తేలితే అక్కడి నుంచి వెళ్లిపోతానని తిరిగి మంచిర్యాలకు ఎట్టి పరిస్థితిలో రానని ఆయన జవాబిచ్చారు. అదే దివాకర్ రావువి తప్పని తేలితే రాజకీయ రంగం నుంచి తప్పుకుంటాడా అని ఆయన ప్రశ్నించారు. గోదావరి నది తీరాన బ్యాక్ వాటర్ తో అన్ని ప్రాంతాలు మునిగిపోతుండగా అక్కడే స్మశాన వాటిక నిర్మించాల్సిన అవసరం ఏముందని ప్రేమ్ సాగర్ రావు ప్రశ్నించారు. పైగా మంచిరాల ప్రజల విరాళాలతో కోటి 20 లక్షల రూపాయల వ్యయంతో ప్రైవేటు భూమి కొనుగోలు చేయడం విడ్డూరంగా ఉందని ఆయన వ్యాఖ్యానించారు. నీటిలో మునిగిపోయే భూమిని కోటి 20 లక్షలు పెట్టి ఎలా కొనుగోలు చేస్తారని ఎమ్మెల్యేను ఆయన నిలదీశారు. మంచిర్యాల పై ప్రేమ అభిమానం ఉంటే ఆయన సొంత డబ్బులతో భూమి కొనుగోలు చేయాలని అన్నారు. మంచిర్యాల ప్రభుత్వ భూములు ఉండగా ఆ ప్రాంతంలో స్మశాన వాటిక నిర్మించకుండా ప్రజల  నుంచి బలవంతంగా డబ్బు సేకరించి భూమి కొనుగోలు చేయడం ఎంతవరకు సబబు అని ఆయన నిలదీశారు. వ్యాపారస్తులు కూడా డబ్బులు ఇచ్చే ముందు ఆలోచించాలని ప్రేమ్ సాగర్ రావు కోరారు. తాను కూడా స్మశాన వాటిక నిర్మిస్తే డబ్బులు ఇస్తారా అని ఆయన అన్నారు.

ప్రభుత్వ నిధులతో ప్రభుత్వం చేయవలసిన పని ప్రజల ఖర్చుతో చేపట్టడం తగదని ఆయన సూచించారు. పైగా బ్యాక్ వాటర్ తో ఇప్పటికే గత వర్షాకాలం మాతా శిశు కేంద్రం మునిగిపోయిందని నీట మునిగే ప్రాంతంలో శ్మశాన వాటిక నిర్మాణం సహేతుకం కాదని అన్నారు. ప్రస్తుతం గుండా సుధాకర్ నిర్వహిస్తున్న శ్మశాన వాటిక కూడా నీట మునిగిందని అదే ప్రాంతంలో శ్మశాన వాటిక నిర్మిస్తే మునుగకుండా ఎమ్మెల్యే అడ్డుకుంటాడా అని అన్నారు. అంతర్గాము లో ఉన్న భూములకు విలువ పెంచడం కోసం కాలేజ్ రోడ్ లో అభివృద్ధి చేస్తున్నాడని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీలో కష్టపడి పనిచేసే వారికి వచ్చే ఎన్నికల్లో టికెట్లు లభిస్తాయని రాహుల్ గాంధీ చెప్పినట్లు ప్రేమ్ సాగర్ రావు గుర్తు చేశారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు రఘునాథ్ తనపై చేసిన ఆరోపణలను ఖండించారు..