చెన్నై: సినీపరిశ్రమలో దిగ్గజ నటులుగా పేరు తెచ్చుకున్నారు కమల్ హాసన్. కెరీర్ లో రాణిస్తోన్న రోజుల్లో వీరిద్దరూ పలు సినిమాల కోసం కలిసి పనిచేశారు. గత కొంతకాలంగా సినిమా, రాజకీయాలతో బిజీ కావడంతో వీరిద్దరూ ఎక్కువగా కలిసింది లేదు. ఈ క్రమంలోనే వీరిద్దరూ కలిస్తే చూడాలని ఆశ పడుతున్న అభిమానుల ఎదురుచూపులకు తెర పడింది. ‘విక్రమ్’ సినిమా ఈ స్టార్ హీరోలను కలిపింది. ‘ఉత్తమ విలన్’ తర్వాత నాలుగేళ్ల విరామం అనంతరం విశ్వనటుడు కమలహాసన్ నటించిన చిత్రం ‘విక్రమ్’. లోకేశ్ కనకరాజు దర్శకుడు. పవర్ఫుల్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా సిద్ధమైన ఈ సినిమాలో కమల్ ఏజెంట్ గా కనిపించనున్నారు. జూన్ 3న ప్రపంచవ్యాప్తంగా ఈసినిమా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో చిత్రబృందం వరుస ప్రమోషన్స్తో ప్రేక్షకులకు ఎంతో చేరువవుతోంది. ఇదిలా ఉండగా, ‘విక్రమ్’ చిత్రబృందానికి రజనీకాంత్ శుభాకాంక్షలు తెలిపారు..
కమల్, లోకేశ్ కనకరాజుని ఇంటికి ఆహ్వానించిన రజనీ.. వారితో ముచ్చటించారు. తన మిత్రుడు కమల్ తో ఎన్నో విషయాలపై సరదాగా మాట్లాడారు. దీనికి సంబంధించిన కొన్ని ఫొటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారాయి.