Telugu Updates
Logo
mobile after logo

డియర్ పేరెంట్స్…!

మార్కులను కాదు పిల్లలను ప్రేమించండి.

వాళ్ల ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీయకండి.

ఆంజనేయులు న్యూస్, తెలంగాణ: డియర్ పేరెంట్స్…!: డియర్ పేరెంట్స్.. ఇది పరీక్షల సమయం! మీ పిల్లల కన్నా మీరే ఎక్కువ ఆందోళనగా ఉండుంటారు.. వాళ్లు పరీక్షలు ఎలా రాస్తారో.. వందకు వంద మార్కులు తెచ్చుకుంటారో లేదో.. ఇంజినీరింగ్, మెడిసిన్ కు ఎలిజిబుల్ గా నిలబడతారో లేదో అని! రేపు పరీక్షలు రాయబోయే పిల్లల్లో ఒక మ్యుజీ షియన్ ఉండొచ్చు.. వాడు కెమిస్ట్రీని పెద్దగా పట్టించుకోకపోవచ్చు. ఒక అథ్లెట్ ఉండొచ్చు.. ఆ అమ్మాయికి ఫిజిక్స్ కన్నా ఫిజికల్ ఫిటెనెస్ ముఖ్యం కావచ్చు. ఆర్టిస్ట్ ఉండొచ్చు.. ఆ స్టూడెంట్కి మ్యాథ్స్ ను అర్ధంచేసుకోవాల్సిన అవసరం లేకపోవచ్చు. ఆంట్రప్రె న్యూర్స్ ఉండొచ్చు.. వాళ్లకు హిస్టరీ, ఇంగ్లిష్ లిటరేచర్ పనిలేకపోవచ్చు. మీ పిల్లలు మంచి మార్కులు తెచ్చుకుంటే చాలా సంతోషం. ఒక వేళ తెచ్చుకోకపోతే.. వాళ్ల ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీయకండి. ‘పర్లేదు..మళ్లీ పరీక్ష రాసుకోవచ్చులే’ అంటూ అనునయించండి. ఆ ప్రేమతో వాళ్ల కలలను సాకారం చేసుకుంటారు. ఆ ధైర్యంతో వాళ్లు జీవితాన్ని గెలుస్తారు. ప్రపంచంలో కేవలం డాక్టర్లు, ఇంజినీర్లు మాత్రమే సంతోషంగా ఉంటారనే మైండ్ సెట్ ను మార్చు కోండి. మార్కులను కాకుండా పిల్లలను ప్రేమించండి.’ ఇది ఒక ప్రిన్సిపల్ పేరెంట్స్ కి రాసిన ఉత్తరం..

Post bottom