Friday, July 3, 2026
HomeTelanganaగురుకుల పాఠశాల ఎంపిక పరీక్షలో రాణించిన విద్యార్థులు

గురుకుల పాఠశాల ఎంపిక పరీక్షలో రాణించిన విద్యార్థులు

📰 Generate e-Paper Clip

Post Midle

ఆంజనేయులు న్యూస్, రెబ్బెన: కొమురం భీం అసిఫాబాద్ జిల్లా రెబ్బెన మండల నంబాల గ్రామంలోని స్కాలర్ ఇంగ్లీష్ మీడియం పాఠశాల లో చదువుతున్న విద్యార్థులు ఈ మధ్య జరిగిన గురుకుల పాఠశాల ఎంపిక పరీక్షలో సత్తా చాటారు. అందులో పాటలు బోధిస్తున్న ప్రతి ఉపాధ్యాయుడు విద్యార్థుల ఎదుగుదలనే ముఖ్యం అన్నట్టు శ్రద్ధగా భోదిస్తూ పిల్లలను క్రమశిక్షణతో ఒక ప్రణాళిక బద్ధంగా ముందుకి నడిపిస్తున్నారు అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు ఎందుకంటే ఏకకాలంలో 9 మంది విద్యార్థులు గురుకుల పాఠశాల ఎంపిక పరీక్షలో సీట్లు పొందడం గొప్ప విషయమనే చెప్పుకోవాలి. ఇంతకు ముందు సంవత్సరం కూడ రెసిడెన్షియల్ పాఠశాలలో స్కాలర్ పాఠశాల విద్యార్థులు సీట్లు పొందారు. ఉపాధ్యాయులు ఎంత బోధించిన పిల్లలకి ఆసక్తి లేకుంటే ఇలాంటి ఘనత సాధించలేము. ఖచ్చితంగా ఈ పోటీ ప్రపంచంలో ప్రతి విద్యార్థి ఏకాగ్రతతో చదువుతూ అన్ని రంగాలలోను విద్యార్థులు ముందుకు వెళ్లాలి. మా పాఠశాల విద్యార్థుల ఎదుగుదల కోసం మా ఉపాధ్యాయ బృందం ఎల్లప్పుడూ నాణ్యమైన విద్యను అందిస్తాము అని పాఠశాల ప్రిన్సిపాల్ మారుమొకం శైలజ తెలిపారు. అలాగే రాబోయే విద్యా సంవత్సరానికి అడ్మిషన్లు కూడ ప్రారంభం అయ్యాయి నంబాల గ్రామ చుట్టూ ప్రక్కల పిల్లల కోసం పాఠశాల వాహనాలు అందుబాటులో ఉన్నాయి తల్లి తండ్రులు గమనించి నిశ్చింతగా మీ పిల్లలను మాతో పాటుగా అడుగులు వేయించగలరని కోరారు. ఎంపిక అయిన ప్రతి విద్యార్థి తల్లి తండ్రులు పాఠశాల యాజమాన్యం పట్ల హర్షం వ్యక్తం చెశారు..

Post bottom
RELATED ARTICLES

Most Popular

App Icon

Install ANJI News App

Add to home screen for faster loading and latest updates.