మంచిర్యాలలో (RCL) రెవెన్యూ క్రికెట్ లీగ్‌కు సన్నాహాలు పూర్తి – 8 జట్లు పోటీ,
ఈ నెల 14–15న ఉషోదయ పాఠశాల మైదానంలో మ్యాచ్‌లు.

ఆంజనేయులు న్యూస్, మంచిర్యాల జిల్లా: నిత్యం కార్యాలయ పనులు, ప్రజా సమస్యల పరిష్కారంలో బిజీగా ఉండే రెవెన్యూ శాఖ సిబ్బంది ఉద్యోగ ఒత్తిడికి విరామం ఇవ్వడానికి క్రీడలను ఆశ్రయిస్తున్నామని, ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ ముఖ్య అతిథిగా హాజరై విజేతలకు బహుమతులు అందజేస్తారని శ్రీనివాస్ రావు దేశ్ పాండే మరియు రెవెన్యూ సంఘం నాయకులు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. జిల్లాలోని రెవెన్యూ శాఖ ఉద్యోగులం కలిసి (RCL) రెవెన్యూ క్రికెట్ లీగ్ పేరిట నిర్వహించేందుకు సన్నాహాలు పూర్తి చేశామని. ఈ నెల 14, 15 తేదీలలో మంచిర్యాల పట్టణంలోని ఉషోదయ పాఠశాల మైదానంలో ఈ మ్యాచ్‌లు జరగనున్నాయి. జిల్లా రెవెన్యూ శాఖకు చెందిన ఆపరేటర్లు, జీపీఓలు, అటెండర్లు నుండి డిప్యూటీ కలెక్టర్ స్థాయి అధికారుల వరకు అందరూ కలిసి మొత్తం 8 జట్లుగా ఏర్పడి ఈ టోర్నీలో పాల్గొననున్నామని. ఉద్యోగ బాధ్యతల మధ్య శారీరక, మానసిక ఉల్లాసం కోసం ఈ క్రికెట్ లీగ్ నిర్వహిస్తున్నట్లు వారు తెలిపారు. రోజువారీ పనుల్లో ఏర్పడే ఒత్తిడిని తగ్గించుకోవడానికి క్రీడలు ఎంతో ఉపయోగపడతాయని వారు పేర్కొన్నారు. అదేవిధంగా ఉద్యోగుల మధ్య స్నేహభావం, పరస్పర సహకారం పెంపొందించడంలో ఇలాంటి క్రీడా కార్యక్రమాలు కీలక పాత్ర పోషిస్తాయని తెలిపారు. క్రికెట్ మ్యాచ్‌లలో ఉద్యోగులు ఉత్సాహంగా పాల్గొని కొంతసేపు కార్యాలయ వాతావరణం నుంచి బయటపడుతూ రిలీఫ్ పొందే అవకాశం కలుగుతుందని చెప్పారు. ఈ సందర్భంగా రెవెన్యూ శాఖ ఉద్యోగులు భారీ సంఖ్యలో పాల్గొని ఈ క్రికెట్ లీగ్‌ను విజయవంతం చేయాలని వారు పిలుపునిచ్చారు.


