Telugu Updates
Logo
Natyam ad

జర్నలిస్టుల కొరకు ప్రత్యేక కంటి వెలుగు శిబిరం నిర్వహణ

జిల్లా వైద్య-ఆరోగ్యశాఖ అధికారి డా॥ జి.సి. సుబ్బారాయుడు

ఆంజనేయులు న్యూస్, మంచిర్యాల జిల్లా: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కంటి వెలుగు 2వ విడత కార్యక్రమంలో భాగంగా ఈ నెల 7వ తేదీన ప్రత్యేక కంటి వెలుగు శిబిరం నిర్వహించడం జరుగుతుందని జిల్లా వైద్య-ఆరోగ్యశాఖ అధికారి డా॥ జి.సి. సుబ్బారాయుడు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలోని పత్రికా విలేకరులు, ఎలక్ట్రానిక్ మీడియా, కేబుల్ ఛానళ్ళ జర్నలిస్టుల కొరకు ఈ నెల 7న జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ వైద్య కళాశాల నందు ఉదయం 9 గం||ల నుండి సాయంత్రం 4 గం||ల వరకు ప్రత్యేక కంటి వెలుగు శిబిరాన్ని నిర్వహించడం జరుగుతుందని, శిబిరానికి ఆధార్ కార్డు తప్పనిసరిగా తీసుకురావాలని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు.