Friday, July 3, 2026
HomeTelanganaబూత్ స్థాయి నుంచి పార్టీ ని బలోపేతం చేయాలి- వివేక్ వెంకటస్వామి

బూత్ స్థాయి నుంచి పార్టీ ని బలోపేతం చేయాలి- వివేక్ వెంకటస్వామి

📰 Generate e-Paper Clip

Post Midle

ఆంజనేయులు న్యూస్, మంచిర్యాల జిల్లా: బీజేపీ బెల్లంపల్లి మండల కార్యవర్గ సమావేశం మండల అధ్యక్షులు గజెల్లి రాజ్ కుమార్ ఆధ్వర్యంలో బెల్లంపల్లి మండలంలోని చంద్రవెల్లి గ్రామములో శనివారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జాతీయ కార్యవర్గ సభ్యులు వివేక్ వెంకటస్వామి, జిల్లా అధ్యక్షులు రఘునాథ్ వెర్రబెల్లి మాట్లాడుతూ. పార్టీని బూత్ స్థాయి నుంచి బలోపేతం చేయాలని దీనికి ప్రతి యొక్క కార్యకర్త కృషి చేయాలని పిలుపునిచ్చారు. అదేవిధంగా మండలంలోని ప్రతి శక్తి కేంద్రాలలో బహిరంగ సభలు నిర్వహించాలని ప్రజా సమస్యల పరిష్కారం కోసం పోరాడుతూ బీఆర్ ఎస్ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలలోకి తీసుకెల్లి రాబోయే రోజుల్లో తెలంగాణ లో కాషాయ జెండా ఎగిరేలా కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమం లో జిల్లా ప్రధానకార్యదర్శులు మునిమంద రమేష్, అందుగుల శ్రీనివాస్, అసెంబ్లీ ఇంఛార్జ్ అన్నపూర్ణ సుదర్శన్ గౌడ్, జిల్లా అధికార ప్రతినిధి బెల్లంపల్లి మండల ఇంఛార్జ్ చిలుముల శ్రీకృష్ణదేవరాయలు, బెల్లంపల్లి అసెంబ్లీ కన్వీనర్ రాచర్ల సంతోష్, జిల్లా ఉపాధ్యక్షులు హరీష్ గౌడ్, జిల్లా కార్యదర్శులు రజిని, గోవర్ధన్, జిల్లా నాయకులు, మండల ప్రధాన కార్యదర్శి ముత్తె రాములు, మండల నాయకులు రఘు, గణేష్, రాజేష్, వినీత్, నాగేష్ పాల్గొన్నారు.

Post bottom
RELATED ARTICLES

Most Popular

App Icon

Install ANJI News App

Add to home screen for faster loading and latest updates.