Wednesday, August 19, 2026
HomeWorld'ప్రేమ'పై సమంత ఆసక్తికర వ్యాఖ్యలు..!

‘ప్రేమ’పై సమంత ఆసక్తికర వ్యాఖ్యలు..!

📰 Generate e-Paper Clip

ఆంజనేయులు న్యూస్: విడాకుల తర్వాత సినీ కెరీర్పై సమంత దృష్టి పెట్టింది. వరుస సినిమాలు చేస్తూ రెండు చేతులా సంపాదిస్తోంది. ఇక తన అభిమానులకు సోషల్ మీడియా ద్వారా నిత్యం అందుబాటులో ఉంటోంది. సోషల్ మీడియాలో అభిమానులతో ముచ్చటిస్తూ, వారు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇస్తోంది. తాజాగా ట్విట్టర్లో #asksam పేరుతో అభిమానుల ప్రశ్నలకు జవాబిచ్చింది. ఇందులో భాగంగా ఓ అభిమాని ఆమెను ప్రేమ గురించి ఆసక్తికర ప్రశ్న అడిగాడు. దీంతో మరలా ప్రేమలో పడే ఆలోచన లేదని సామ్ బదులిచ్చింది. ప్రేమ, ద్వేషం లాంటి వాటికి దూరంగా ఉండడానికి ప్రయత్నిస్తున్నట్లు బదులిచ్చింది. దీంతో మరోసారి ప్రేమలో పడే అవకాశం లేదన్నట్లు సామ్ చెప్పిందని నెటిజన్లు చర్చించుకుంటున్నారు.

ఇదిలా ఉండగా ప్రస్తుతం సామ్ వరుస సినిమాలతో బిజీగా మారిపోయింది. ఏప్రిల్ 28న విజయ్ సేతుపతి, నయనతారతో కలిసి ఆమె నటించిన ‘కాత్తు వాక్కుల రెండు కాదల్’ సినిమా విడుదలైంది. గుణశేఖర్ దర్శకత్వంలో ‘శాకుంతలం’, హరిశంకర్ దర్శకత్వంలో ‘యశోద’, శివ నిర్వాణ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా వస్తున్న సినిమాలు ప్రస్తుతం ఆమె చేతిలో ఉన్నాయి. బాలీవుడ్లోనూ ఆమె క్రేజీ ప్రాజెక్టులకు సంతకం చేసిందని సమాచారం.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install Anjaneyulu News APP App

Add to home screen for faster loading and latest updates.