Thursday, November 12, 2026
HomeWorldఓజోన్ పొరకు భారీ రంధ్రం.. భూమికి పొంచి ఉన్న ముప్పు!

ఓజోన్ పొరకు భారీ రంధ్రం.. భూమికి పొంచి ఉన్న ముప్పు!

48 ఏళ్లలో ఏడో అతిపెద్ద రంధ్రం.. ఆందోళన అవసరం లేదంటున్న నాసా.

📰 Generate e-Paper Clip

తెలంగాణ నవంబర్ 12, ( ఆంజనేయులు న్యూస్ )

అంటార్కిటికా ప్రాంతంలోని ఓజోన్ పొరలో భారీ రంధ్రం ఏర్పడటం చర్చనీయాంశంగా మారింది. సెప్టెంబర్ 18న ఈ రంధ్రం గరిష్టంగా 2.71 కోట్ల చదరపు కిలోమీటర్ల విస్తీర్ణానికి చేరుకుంది. గత 48 ఏళ్లలో నమోదైన అతిపెద్ద రంధ్రాల్లో ఇది ఏడో స్థానంలో ఉందని నాసా వెల్లడించింది. వాతావరణంలో నెలకొన్న అత్యంత శీతల పరిస్థితులు, బలమైన ధ్రువ సుడిగాలుల ప్రభావంతో ఓజోన్ పొరలో ఈ మార్పు చోటుచేసుకున్నట్లు శాస్త్రవేత్తలు వివరిస్తున్నారు. అయితే ఈ పరిణామంపై ప్రజలు తీవ్ర ఆందోళన చెందాల్సిన అవసరం లేదని నాసా స్పష్టం చేసింది. ఓజోన్ పొర పునరుద్ధరణ ప్రక్రియ ఆశాజనకంగానే కొనసాగుతోందని, వాతావరణ పరిస్థితుల కారణంగా ఈ ఏడాది తాత్కాలికంగా రంధ్రం పరిమాణం పెరిగిందని పేర్కొంది. అయితే, ఓజోన్ పొరలో ఏర్పడిన రంధ్రం అంటే పొర పూర్తిగా చీలిపోయిందని అర్థం కాదని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఓజోన్ సాంద్రత గణనీయంగా తగ్గిన ప్రాంతాన్నే రంధ్రంగా పరిగణిస్తారు. ఈ పొర సూర్యుడి నుంచి వచ్చే హానికరమైన అతినీలలోహిత కిరణాల నుంచి భూమిపై జీవరాశులను రక్షిస్తుంది. దీర్ఘకాలంలో ఓజోన్ పొర పునరుద్ధరణ ఆశాజనకంగానే ఉందని నాసా, NOAA వెల్లడించాయి.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install Anjaneyulu News APP App

Add to home screen for faster loading and latest updates.