Wednesday, November 11, 2026
HomeTelanganaమంచిర్యాలవిధుల పట్ల నిర్లక్ష్యం.. ఇద్దరు హెచ్ఎంలపై కలెక్టర్ చర్యలు!

విధుల పట్ల నిర్లక్ష్యం.. ఇద్దరు హెచ్ఎంలపై కలెక్టర్ చర్యలు!

📰 Generate e-Paper Clip

మంచిర్యాల, నవంబర్ 10, ( ఆంజనేయులు న్యూస్ )

విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఇద్దరు ప్రధానోపాధ్యాయులపై జిల్లా కలెక్టర్ కె. హరిత చర్యలకు ఆదేశించారు. విద్యార్థులకు ఆదర్శంగా నిలవాల్సిన ఉపాధ్యాయులు బాధ్యతారాహిత్యంగా వ్యవహరించడాన్ని తీవ్రంగా పరిగణించారు.

తిర్యాణి మండలంలోని పీఎం శ్రీ మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు సంబరం శ్రీనివాస్ మద్యం సేవించి పాఠశాలకు వచ్చినట్లు గుర్తించడంతో ఆయనను సస్పెండ్ చేస్తూ కలెక్టర్ సోమవారం ఉత్తర్వులపై సంతకం చేశారు. అదేవిధంగా సలుగుపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు రవి విధులకు సంబంధించిన సమావేశం ముగియకముందే వెళ్లిపోవడంపై కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయనపై సస్పెన్షన్ చర్యలు తీసుకోవాలని జిల్లా విద్యాశాఖ అధికారిని ఆదేశించారు. విద్యాశాఖ అధికారులు, ఉపాధ్యాయులు విధి నిర్వహణలో క్రమశిక్షణ పాటించాలని, ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తే చర్యలు తప్పవని కలెక్టర్ స్పష్టం చేసినట్లు సమాచారం.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install Anjaneyulu News APP App

Add to home screen for faster loading and latest updates.