ఓజోన్ పొరకు భారీ రంధ్రం.. భూమికి పొంచి ఉన్న ముప్పు!
తెలంగాణ నవంబర్ 12, ( ఆంజనేయులు న్యూస్ ) అంటార్కిటికా ప్రాంతంలోని ఓజోన్ పొరలో భారీ రంధ్రం ఏర్పడటం చర్చనీయాంశంగా మారింది. సెప్టెంబర్ 18న ఈ రంధ్రం గరిష్టంగా 2.71 కోట్ల చదరపు కిలోమీటర్ల విస్తీర్ణానికి చేరుకుంది. గత 48 ఏళ్లలో నమోదైన అతిపెద్ద రంధ్రాల్లో ఇది ఏడో స్థానంలో ఉందని నాసా వెల్లడించింది. వాతావరణంలో నెలకొన్న అత్యంత శీతల పరిస్థితులు, బలమైన ధ్రువ సుడిగాలుల ప్రభావంతో ఓజోన్ పొరలో ఈ మార్పు చోటుచేసుకున్నట్లు శాస్త్రవేత్తలు వివరిస్తున్నారు. అయితే ఈ పరిణామంపై ప్రజలు తీవ్ర...