Friday, November 27, 2026
HomeTelanganaఆపదలో విద్యార్థికి అండగా రివిలేషన్ పాఠశాల

ఆపదలో విద్యార్థికి అండగా రివిలేషన్ పాఠశాల

వైద్య చికిత్స కోసం రూ.50 వేల ఆర్థిక సహాయం.. మానవత్వాన్ని చాటుకున్న విద్యార్థులు, ఉపాధ్యాయులు..

📰 Generate e-Paper Clip

మంచిర్యాల, నవంబర్ 27, ( ఆంజనేయులు న్యూస్ )

తోటి విద్యార్థి అనారోగ్యంతో బాధపడుతున్నాడని తెలుసుకున్న రివిలేషన్ హైస్కూల్ విద్యార్థులు, ఉపాధ్యాయులు, పాఠశాల యాజమాన్యం, తల్లిదండ్రులు మానవత్వాన్ని చాటుకున్నారు. పాఠశాలలో నాలుగో తరగతి చదువుతున్న షేక్ అమెర్ తీవ్ర అనారోగ్యంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విషయం తెలుసుకొని, అతని వైద్య ఖర్చుల నిమిత్తం రూ.50 వేల ఆర్థిక సహాయం అందించారు. ఇందులో కొంత మొత్తాన్ని ఫోన్‌పే ద్వారా, మరికొంత నగదు రూపంలో అందజేశారు. విద్యార్థి కుటుంబం ఆర్థిక ఇబ్బందుల్లో ఉందని తెలుసుకున్న పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు స్వచ్ఛందంగా విరాళాలు సేకరించి ఆపదలో ఉన్న కుటుంబానికి అండగా నిలిచారు. ఈ విషయాన్ని నూతన విద్యావిధాన అధ్యయన యాత్రలో భాగంగా గుజరాత్ రాష్ట్రంలోని అహ్మదాబాద్‌లో ఉన్న రివిలేషన్ విద్యాసంస్థల చైర్మన్ డాక్టర్ రాపోలు విష్ణువర్ధన్ రావు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విద్యార్థులకు కేవలం పాఠ్యాంశాలను బోధించడమే కాకుండా, వారిలో దయ, కరుణ, సేవాభావం, సామాజిక బాధ్యత వంటి మానవీయ విలువలను పెంపొందించడం ప్రతి విద్యాసంస్థ బాధ్యత అని అన్నారు. విద్య అంటే కేవలం మార్కులు, ర్యాంకులు, పుస్తక జ్ఞానం మాత్రమే కాదని, ఆపదలో ఉన్నవారికి అండగా నిలవడం, ఎదుటివారి బాధను అర్థం చేసుకొని సహాయం చేయడమే నిజమైన విద్య అని పేర్కొన్నారు. ఈ మానవతా కార్యక్రమంలో భాగస్వాములైన ఉపాధ్యాయులు, విద్యార్థులు, సహకరించిన తల్లిదండ్రులకు పాఠశాల యాజమాన్యం తరఫున కృతజ్ఞతలు తెలిపారు. విద్యార్థి షేక్ అమెర్ త్వరగా కోలుకొని సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి పాఠశాలకు రావాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్ మద్దెర్ల ప్రశాంత్, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install Anjaneyulu News APP App

Add to home screen for faster loading and latest updates.