ఆపదలో విద్యార్థికి అండగా రివిలేషన్ పాఠశాల

మంచిర్యాల, నవంబర్ 27, ( ఆంజనేయులు న్యూస్ ) తోటి విద్యార్థి అనారోగ్యంతో బాధపడుతున్నాడని తెలుసుకున్న రివిలేషన్ హైస్కూల్ విద్యార్థులు, ఉపాధ్యాయులు, పాఠశాల యాజమాన్యం, తల్లిదండ్రులు మానవత్వాన్ని చాటుకున్నారు. పాఠశాలలో నాలుగో తరగతి చదువుతున్న షేక్ అమెర్ తీవ్ర అనారోగ్యంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విషయం తెలుసుకొని, అతని వైద్య ఖర్చుల నిమిత్తం రూ.50 వేల ఆర్థిక సహాయం అందించారు. ఇందులో కొంత మొత్తాన్ని ఫోన్‌పే ద్వారా, మరికొంత నగదు రూపంలో అందజేశారు. విద్యార్థి కుటుంబం ఆర్థిక ఇబ్బందుల్లో ఉందని తెలుసుకున్న పాఠశాల ఉపాధ్యాయులు,...