Monday, November 9, 2026
HomeTelanganaలంచం తీసుకుంటూ ACBకి చిక్కిన ఎస్ఐ..!!

లంచం తీసుకుంటూ ACBకి చిక్కిన ఎస్ఐ..!!

📰 Generate e-Paper Clip

మేడ్చల్, నవంబర్ 9, ( ఆంజనేయులు న్యూస్ )

 మేడ్చల్ జిల్లా కీసర పోలీస్ స్టేషన్‌లో మరో అవినీతి ఘటన వెలుగులోకి వచ్చింది. ఎస్ఐ శ్రీనివాస్ రూ.2 లక్షల లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు. నాగారం పరిధిలోని శిల్పానగర్‌లో లంచం తీసుకుంటుండగా అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నట్లు సమాచారం. ఓ కేసులో చార్జిషీట్ దాఖలు చేసేందుకు ఎస్ఐ రూ.2 లక్షలు డిమాండ్ చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ క్రమంలో బాధితుడి ఫిర్యాదుతో ఏసీబీ అధికారులు దాడి చేసి ఎస్ఐను పట్టుకున్నట్లు తెలుస్తోంది. ఇదే కీసర పోలీస్ స్టేషన్‌లో ఇటీవల సీఐ కూడా లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడిన విషయం తెలిసిందే. తాజాగా మరో ఎస్ఐ పట్టుబడటంతో ఒకే పోలీస్ స్టేషన్‌లో వరుస అవినీతి ఘటనలు చోటుచేసుకోవడం పోలీస్ శాఖలో చర్చనీయాంశంగా మారింది.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install Anjaneyulu News APP App

Add to home screen for faster loading and latest updates.