లంచం తీసుకుంటూ ACBకి చిక్కిన ఎస్ఐ..!!

మేడ్చల్, నవంబర్ 9, ( ఆంజనేయులు న్యూస్ )  మేడ్చల్ జిల్లా కీసర పోలీస్ స్టేషన్‌లో మరో అవినీతి ఘటన వెలుగులోకి వచ్చింది. ఎస్ఐ శ్రీనివాస్ రూ.2 లక్షల లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు. నాగారం పరిధిలోని శిల్పానగర్‌లో లంచం తీసుకుంటుండగా అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నట్లు సమాచారం. ఓ కేసులో చార్జిషీట్ దాఖలు చేసేందుకు ఎస్ఐ రూ.2 లక్షలు డిమాండ్ చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ క్రమంలో బాధితుడి ఫిర్యాదుతో ఏసీబీ అధికారులు దాడి చేసి ఎస్ఐను పట్టుకున్నట్లు తెలుస్తోంది. ఇదే కీసర...