Monday, November 9, 2026
HomeTelanganaనేడు సీఎం రేవంత్ రెడ్డి జన్మదినం.. రాజకీయ ప్రస్థానం ఇదే.!

నేడు సీఎం రేవంత్ రెడ్డి జన్మదినం.. రాజకీయ ప్రస్థానం ఇదే.!

📰 Generate e-Paper Clip

హైదరాబాద్, నవంబర్ 8, ( ఆంజనేయులు న్యూస్ )

తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి నేడు (నవంబర్ 8) తన 57వ జన్మదినాన్ని జరుపుకుంటున్నారు. 1969 నవంబర్ 8న ప్రస్తుత నాగర్‌కర్నూల్ జిల్లా కొండారెడ్డిపల్లిలో జన్మించిన ఆయన విద్యార్థి దశ నుంచే రాజకీయాలపై ఆసక్తి పెంచుకున్నారు. ఏబీవీపీ కార్యకర్తగా విద్యార్థి రాజకీయాల్లో అడుగుపెట్టి, అంచెలంచెలుగా ఎదుగుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి పదవిని చేపట్టారు. రేవంత్ రెడ్డి రాజకీయ ప్రస్థానం 2006లో మిడ్జిల్ మండలం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా జెడ్పీటీసీ సభ్యుడిగా ఎన్నిక కావడంతో ప్రారంభమైంది. 2007లో స్వతంత్ర అభ్యర్థిగా ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. అనంతరం తెలుగుదేశం పార్టీలో చేరి 2009, 2014 ఎన్నికల్లో కొడంగల్ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2017 అక్టోబర్‌లో టీడీపీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో కొడంగల్ నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. అయితే 2019 సార్వత్రిక ఎన్నికల్లో మల్కాజిగిరి లోక్‌సభ స్థానం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి ఎంపీగా విజయం సాధించారు. 2021లో టీపీసీసీ అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన రేవంత్ రెడ్డి.. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావడంలో కీలక పాత్ర పోషించారు. కాంగ్రెస్ విజయం అనంతరం 2023 డిసెంబర్ 7న తెలంగాణ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. జెడ్పీటీసీ సభ్యుడిగా ప్రారంభమైన ఆయన ప్రస్థానం ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే, ఎంపీ మీదుగా ముఖ్యమంత్రి స్థాయికి చేరుకుంది. ఈ సందర్భంగా పలువురు రాజకీయ ప్రముఖులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install Anjaneyulu News APP App

Add to home screen for faster loading and latest updates.