నేడు సీఎం రేవంత్ రెడ్డి జన్మదినం.. రాజకీయ ప్రస్థానం ఇదే.!

హైదరాబాద్, నవంబర్ 8, ( ఆంజనేయులు న్యూస్ ) తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి నేడు (నవంబర్ 8) తన 57వ జన్మదినాన్ని జరుపుకుంటున్నారు. 1969 నవంబర్ 8న ప్రస్తుత నాగర్‌కర్నూల్ జిల్లా కొండారెడ్డిపల్లిలో జన్మించిన ఆయన విద్యార్థి దశ నుంచే రాజకీయాలపై ఆసక్తి పెంచుకున్నారు. ఏబీవీపీ కార్యకర్తగా విద్యార్థి రాజకీయాల్లో అడుగుపెట్టి, అంచెలంచెలుగా ఎదుగుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి పదవిని చేపట్టారు. రేవంత్ రెడ్డి రాజకీయ ప్రస్థానం 2006లో మిడ్జిల్ మండలం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా జెడ్పీటీసీ సభ్యుడిగా ఎన్నిక కావడంతో ప్రారంభమైంది....