మహబూబ్‌నగర్, నవంబర్ 5, ( ఆంజనేయులు న్యూస్ )
కాంట్రాక్టర్‌కు సంబంధించిన రూ.3 లక్షల బిల్లుల చెల్లింపు కోసం రూ.లక్ష లంచం డిమాండ్ చేసి తీసుకుంటుండగా మహబూబ్‌నగర్ జిల్లా యూత్ అండ్ స్పోర్ట్స్ అధికారి రాజేందర్‌రెడ్డి, కంప్యూటర్ ఆపరేటర్‌ను ఏసీబీ అధికారులు గురువారం పట్టుకున్నారు. క్లాక్‌టవర్ సమీపంలోని ఓ హోటల్ వద్ద లంచం తీసుకుంటుండగా ఏసీబీ డీఎస్పీ బాలకృష్ణ నేతృత్వంలోని బృందం దాడి చేసి పట్టుకుంది. కేసు నమోదు చేసిన అధికారులు నిందితులను రిమాండ్‌కు తరలించారు.
