Thursday, July 2, 2026
HomeCrimeఆ ఉన్నతాధికారి నన్ను వేధిస్తున్నారు.

ఆ ఉన్నతాధికారి నన్ను వేధిస్తున్నారు.

సీఎస్ కు అటవీశాఖ మహిళా సూపరింటెండెంట్ లేఖ

ఆతనీ పై చర్య తీసుకోండి లేదా నాకు వీఆర్ఎస్ ఇవ్వండి

Post Midle

హైదరాబాద్: అటవీశాఖలో ఓ ఉన్నతాధికారి కొంతకాలంగా తనను వేధింపులకు గురిచేస్తున్నారని, ఆయనపై చర్యలు తీసుకోవాలంటూ అదే శాఖలోని మహిళా సూపరింటెండెంట్ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. దీనిపై మహిళా కమిషన్, అటవీ, పర్యావరణశాఖ అధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లేకపోగా వేధింపులు ఎక్కువయ్యాయని ఆమె వాపోయారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ కు లేఖ రాశారు. కొంతకాలంగా ఉన్నతాధికారి తనను వేధింపులకు గురి చేస్తున్నారని, దీనిపై రాష్ట్ర, జాతీయ మహిళా కమిషన్ కు కేంద్ర, రాష్ట్ర అటవీ, పర్యావరణ శాఖ అధికారులకు ఫిర్యాదు చేశానని సీఎస్ కు రాసిన లేఖలో వివరించారు. దీనిపై మహిళా కమిషన్.. సంబంధిత అధికారిని విచారణకు పిలిస్తే, మహిళా అధికారితో విచారణ చేయించి నివేదికను పంపుతామని పేర్కొన్నారన్నారు. కానీ ఆయనే స్వయంగా విచారణ చేపట్టి తప్పుడు నివేదికను రూపొందించారని సీఎస్ దృష్టికి తెచ్చారు. వేధింపుల ఫిర్యాదుపై ఇప్పటివరకు నివేదిక రాలేదని.., రాష్ట్ర మహిళా కమిషన్ లేఖ రాసినా.. సమాధానం లేదని, చర్యలు తీసుకోవాలని జాతీయ మహిళా కమిషన్ తెలంగాణ పోలీసులకు సూచించినా వారిపై ఒత్తిడి తెచ్చి చర్య తీసుకోకుండా చేశారన్నారు. తనపై అధికారి విచారణ చేసి ఇచ్చిన నివేదికలో నోట్స్ సరిగా రాయలేదని లేఖలో పేర్కొన్నారు.

ఈకారణంగా తాను మానసిక క్షోభను అనుభవిస్తున్నానని వివరించారు. ‘ఆయనపై చర్య అయినా తీసుకోండి లేదా నాకు వీఆర్ఎస్ ఇచ్చి అయినా పంపండి’ అని సీఎస్ కు రాసిన లేఖలో పేర్కొన్నారు. ఓ జిల్లా కేంద్రంలో సూపరింటెండెంట్ గా పనిచేస్తున్న ఈ మహిళా అధికారి ఫిర్యాదులో పేర్కొన్న అంశాలకు సంబంధించి ఆధారాలను జత చేశారు..

Post bottom
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments