Telugu Updates
Logo
Natyam ad

భారీ వర్షాల దృష్ట్యా ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలి

లోతట్టు ప్రాంతాలను పరిశీలిస్తున్న జిల్లా కలెక్టర్ భారతి హోలీకేరి

మంచిర్యాల జిల్లా: ఆదివారం జిల్లా కేంద్రంలోని గత రెండు మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా లోతట్టు ప్రాంతాలు అర్జున్ గుట్ట  రాంపూర్ మధ్యలోని నీటి నిలువ ప్రాంతాలను పరిశీలించి తగు సూచనలు సలహాలు ఇస్తున్న జిల్లా కలెక్టర్ భారతి హోళీ కేరి.. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. రాబోవు 48 గంటల్లో భారీ వర్ష సూచన ఉన్నందున ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా అధికారులు ముందు జాగ్రత్తలు చేపట్టాలని, లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని, పాత ఇండ్లు, శిథిలావస్థలో ఉన్న నివాసాలలో ఉండే ప్రజలు మరింత జాగ్రత్తగా ఉండాలని తెలిపారు. భారీ వర్షాల దృష్ట్వా జిల్లాలో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని, అధికార యంత్రం ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని కలెక్టర్ అన్నారు..