సర్పంచ్ పదవి కోసం ఎస్సీ మహిళతో పెళ్లి.. చివరికి

ఆంజనేయులు న్యూస్, కరీంనగర్ జిల్లా: గంగాధర మండలంలో సర్పంచ్ పదవి కోసం హడావుడిగా చేసిన పెళ్లి బెడిసికొట్టింది. సీటు ఎస్సీ మహిళలకు రిజర్వ్ కావడంతో, స్థానిక యువకుడు నల్గొండకు చెందిన ఓ ఎస్సీ మహిళను తొందరపడి వివాహం చేసుకున్నాడు. ఆమె పేరును ఓటరు జాబితాలో చేర్చి నామినేషన్ దాఖలు చేయాలనుకున్నాడు. అయితే పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ ముందుగానే వెలువడటంతో ఓటరు జాబితా గడువు ముగిసిపోయింది. దీంతో ఆమె పేరు చేరకపోవడంతో, నామినేషన్ అర్హత కోల్పోయి సీన్ రివర్స్ అయ్యింది. రాజకీయ ఆశతో చేసిన పెళ్లి కాస్త వృథాగా మారింది.


