Telugu Updates
Logo
mobile after logo

కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించి అభివృద్ధికి సహకరించండి

మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు

ఆంజనేయులు న్యూస్, మంచిర్యాల జిల్లా: కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించి నియోజకవర్గ అభివృద్ధికి సహకరించాలని ప్రజలను కోరిన మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు. శనివారం మంచిర్యాల జిల్లా లక్షేటిపేట మున్సిపాలిటీలోని విశ్రాంతి భవన ఆవరణలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో అయన పాల్గొని మాట్లాడారు. రెండు నెలల విరామం తర్వాత లక్షేటిపేటకు వచ్చిన ఆయనకు నాయకులు, కార్యకర్తలు ఘనంగా స్వాగతం పలికారు. ఈ సమావేశంలో హాజీపూర్, లక్షేటిపేట, దండేపల్లి మండలాలకు చెందిన కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థులను ప్రకటించి విలేకరులతో మాట్లాడిన ఎమ్మెల్యే ముందుగా తన ఆరోగ్యం కొరకు ప్రార్థనలు చేసిన ప్రతీ ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. వైద్య పరమైన సహాయ సహకరాలు అందించిన సీఎం రేవంత్ రెడ్డి, ఉపముఖ్య మంత్రి బట్టి మరియు మంత్రుల బృందానికి కుడా ధన్యవాదాలు తెలిపారు. అభివృద్ధి విషయంలో రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో మంచిర్యాల నియోజకవర్గం ఉండేలా ముందుకు సాగుతున్నామని, అభివృద్ధికాంక్షించే ప్రజలు రానున్న సర్పంచ్ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించి రాష్ట్రానికి ఆదర్శంగా నిలిచి మరింత అభివృద్ధి దిశగా అడుగులు వేద్దామని కోరారు. అనంతరం ప్రభుత్వ ఆసుపత్రిని పరిశీలించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకురాలు సురేఖమ్మ, అర్జీపీస్ అధ్యక్షులు గడ్డం త్రిమూర్తి, పట్టణ అధ్యక్షులు ఎండి ఆరిఫ్, మండల అధ్యక్షులు పింగళి రమేష్, మాజీ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ చెల్ల నాగభూషణం, జిల్లా ఉపాధ్యక్షులు చింత అశోక్ కుమార్, డీసీసీ అధికార ప్రతినిధి పూర్ణ చందర్ రావు, జిల్లా ఆర్టీయె మెంబర్ అంకతి శ్రీనివాస్, మార్కెట్ కమిటీ చైర్మన్ దాసరి ప్రేమ్ చందు,బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు నలిమేల రాజు, మాజీ ఎంపిటీసీ గడ్డం శ్రీనివాస్, మాజీ కౌన్సిలర్లు, మాజీ సర్పంచులు,మరియు కాంగ్రెస్ నాయకులు, పెద్ద ఎత్తున్న కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.

Post bottom