
మంచిర్యాల జిల్లా కలెక్టర్ భారతి హోళికేరి
ఆంజనేయులు న్యూస్, మంచిర్యాల జిల్లా: గణాంక మంత్రిత్వ శాఖ, నేషనల్ స్టాటిస్టికల్ కార్యాలయం ఆధ్వర్యంలో జిల్లాలో సి.ఎ.ఎం.ఎస్., ఆయుష్ సర్వే కార్యక్రమం చేపట్టడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ భారతి హోళ్ళికేరి ఒక ప్రకటనలో తెలిపారు. కొవిడ్-19 నుండి 3 సంవత్సరాల విరామం తర్వాత 79వ జాతీయ గణాంక సర్వే ప్రారంభించడం జరుగుతుందని, భారతీయ ఔషధం యొక్క ఉపయోగం, ప్రభావం గురించి ప్రజలలో అవగాహన కల్పించడం జరుగుతుందని తెలిపారు. ఆయుష్ పరిధిలోని ఆయుర్వేద, యోగ, యునాని, సిద్ధ, హోమియోపతి, సోవా-రిగ్పా అమ్చి, ప్రకృతి వైద్యంపై మొదటి విడతలో జూలై నుండి సెప్టెంబర్ వరకు, 2 విడత అక్టోబర్ నుండి డిసెంబర్ వరకు, 3వ విడత జనవరి-23 నుండి మార్చి – 23 వరకు, 4వ విడతగా ఏప్రిల్-23. నుండి జూన్-23 వరకు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. సుస్థిర అభివృద్ధి లక్ష్యాలను సాధించేందుకు, సూచికలను మూల్యాంకనం చేసేందుకు సర్వే చేపట్టడం జరుగుతుందని, డైరక్టరేట్ ఆఫ్ ఎకనామిక్స్ అండ్ స్టాటిస్టిక్స్, హైదరాబాద్ రాష్ట్ర నోడల్ ఏజెన్సీగా అన్ని జిల్లాల్లో సర్వే నిర్వహించేందుకు చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. జిల్లా, మండల స్థాయిలో పని చేస్తున్న మండల ప్రణాళిక అధికారులు, సంబంధిత అధికారులకు రాష్ట్ర ప్రధాన కార్యాలయంలో సర్వే కోసం పూర్తి స్థాయి శిక్షణ ఇవ్వడం జరుగుతుందని తెలిపారు.
సెప్టెంబర్ 2వ తేదీ నుంచి జిల్లాలో గ్రామీణ, పట్టణ బ్లాకులలో ఎంపిక చేసిన నమూనా ఆవాసాలలో సర్వే బృందాలను ఏర్పాటు చేసి ప్రారంభించడం జరిగిందని, జూన్ 30, 2023న సర్వే ముగుస్తుందని తెలిపారు. జన్నారం మండలంలోని పొనకల్, మల్యాల, పొనకల్, దండేపల్లి మండలం తానిమడుగు, బెల్లంపల్లి మండలం బట్వాన్పల్లి, జైపూర్ మండలం ఇందారం, లక్షెట్టిపేట మండలం పాతకొమ్ముగూడెం, భీమిని మండలం లక్ష్మీపూర్, మున్సిపల్ పరిధిలోని అర్బన్ బ్లాక్ లు, మంచిర్యాల, క్యాతన్ పల్లి, నస్పూర్, లక్షెట్టిపేట, మందమర్రి సర్వే బృందాలు సర్వే కోసం రూపొందించిన నిర్ణీత ప్రశ్నాపత్రాలను కాన్వాస్ చేయడానికి ఎంపిక చేసిన నివాసం, బ్లాక్ లోని కుటుంబాలను సంప్రదించి స్థితిని తెలుసుకుంటారని తెలిపారు. భారతీయ ఔషధ వినియోగంపై కుటుంబాలు వారి సామాజిక, ఆర్థిక పరిస్థితులకు సంబంధించి, గత రెండు సంవత్సరాలుగా కరోనా పరిస్థితులలో అనుభవాలను ఎదుర్కొన్న సందర్భంలో పూర్వీకుల చిట్కాలను వర్తింపజేయడం ద్వారా కొవిడ్-19ను నిరోధించడంపై సేకరించిన డేటాను కంప్యూటరీకరించి, ప్రభుత్వానికి విధానాల రూపకల్పన కోసం ప్రదర్శన, సమగ్ర విశ్లేషణ కోసం అందించడం జరుగుతుందని తెలిపారు.

