Telugu Updates
Logo
mobile after logo

రైతు కుటుంబాలకు అండగా ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు

– ఒక్కొక్కరికి రూ.2 లక్షల సహాయం ప్రకటింపు

ఆంజనేయులు న్యూస్, మంచిర్యాల జిల్లా: లక్షెట్టిపేట మండలంలోని కొత్తూరు, గంపలపల్లి గ్రామాల్లో నిన్న చోటుచేసుకున్న ప్రమాద ఘటనలపై మంచిర్యాల శాసనసభ్యులు కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు తక్షణమే స్పందించారు. ఈ ఘటనలో నలుగురు రైతులు మృతి చెందడం అత్యంత విషాదకరమని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

మరణించిన రైతుల కుటుంబాలకు తన వ్యక్తిగతంగా ఒక్కొక్కరికి రూ.2 లక్షల చొప్పున తక్షణ ఆర్థిక సహాయం అందజేస్తానని ఎమ్మెల్యే ప్రకటించారు. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం తరఫున ప్రతి కుటుంబానికి రూ.5 లక్షల ఆర్థిక సహాయం అందేలా చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు. ఈ కష్టకాలంలో బాధిత కుటుంబాలకు ఎల్లప్పుడూ అండగా ఉంటామని, వారికి అవసరమైన సహాయ సహకారాలు అందించేందుకు సిద్ధంగా ఉన్నామని ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు పేర్కొన్నారు.

Post bottom