మంచిర్యాల డిసిపి సుధీర్ కేకన్ ఐపిఎస్
రోడ్డు భద్రతా వారోత్సవాలు సందర్భంగా మంచిర్యాల పట్టణం లో హెల్మెట్ యొక్క ఉపయోగాల గురించి అవగాహన ర్యాలీ నిర్వహించిన ట్రాఫిక్ పోలీసులు
ఆంజనేయులు న్యూస్, మంచిర్యాల జిల్లా: రోడ్డు భద్రతా మాసోత్సవాలు సందర్భంగా మంగళవారం మంచిర్యాల పట్టణంలో హెల్మెట్ యొక్క ఉపయోగాల గురించి అవగాహన కల్పించి, అనంతరం హెల్మెట్ ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఇట్టి కార్యక్రమానికి మంచిర్యాల డిసిపి సుదీర్ కేకన్ ఐపిఎస్, ముఖ్యఅతిథిగా హాజరై ర్యాలీలో పాల్గొనడం జరిగింది. ఇట్టి ర్యాలీ మంచిర్యాల ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ నరేష్ జెండా ఊపి ప్రారంభించగా మంచిర్యాల పోలీస్ స్టేషన్ నుండి ప్రారంభమై రైల్వే స్టేషన్, ముఖరం చౌరస్తా, రైల్వే బ్రిడ్జి, ఐబీ చౌరస్తా, బెల్లంపల్లి చౌరస్తా మీదుగా తిరిగి పోలీస్ స్టేషన్ వద్ద ముగియడం జరిగింది. ఈ సందర్భంగా డిసిపి మాట్లాడుతూ.. ప్రతి మోటార్ సైకిల్ వాహనదారుడు హెల్మెట్ ధరించాలని, హెల్మెట్ ధరించని వారిపై తరచుగా స్పెషల్ డ్రైవ్ నిర్వహించి, కేసులు నమోదు చేస్తామని తెలిపారు. రోడ్డు ప్రమాదాల్లో హెల్మెట్ ధరించకుండా చాలామంది మోటార్ సైకిల్ వాహనదారులు తరచుగా మరణించడం జరుగుతుందన్నారు మరియు ప్రతి ఒక్కరూ వాహనానికి సంబంధించిన డాక్యుమెంట్స్ వెంబడి ఉంచుకోవాలని, త్రిబుల్ రైడింగ్ , మరియు రాష్ డ్రైవింగ్ చేయవద్దని సూచించారు. మరియు మోటార్ సైకిల్ వాహన చోదకులు తప్పకుండా హెల్మెట్ ధరించాలని హెల్మెట్ బరువుగా కాకుండా బాధ్యతగా భావించాలని, హెల్మెట్ మా శాసనం కాదు మీ సంక్షేమం, హెల్మెట్ ఒక వస్తువు కాదు ప్రాణాన్ని కాపాడే ఆయుధం, రోడ్ చిన్నదైనా పెద్దదైన, పడితే ప్రమాదమే ఆదమరిస్తే విషాదమైన ఎక్కడైనా ఎప్పుడైనా చిన్నవారైన పెద్దవారైనా ప్రమాదం పొంచి ఉన్నదని ఎవరికెరుక అందుకే ద్విచక్ర వాహనాలు నడిపేటప్పుడు ప్రజలందరూ తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ ఏసిపి నర్సింహులు , మంచిర్యాల ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ నరేష్ కుమార్, ఎస్సైలు సిబ్బంది పాల్గొన్నారు.

