Telugu Updates
Logo
mobile after logo

ఎయిడ్స్ రహిత సమాజ నిర్మాణానికి పాటు పడాలి

జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ అనిత

ఆంజనేయులు న్యూస్, మంచిర్యాల జిల్లా: ప్రపంచ ఎయిడ్స్ నియంత్రణ దినోత్సవాన్ని పురస్కరించుకొని జిల్లా హెచ్ఐవి ఎయిడ్స్ సమీకృత వ్యూహ సంస్థ ఆద్వర్యంలో ఆదివారం జిల్లా ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి నందు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ అనిత హాజరై జెండా ఊపి కార్యక్రమాన్ని ప్రారంభించారు.. అనంతరం డాక్టర్ అనిత మాట్లాడుతూ.. ఎయిడ్స్ రహిత సమాజ నిర్మాణానికి కృషి చేయాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని, హెచ్ఐవీ వైరస్ సోకకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, సోకిన అనంతరం పాటించాల్సిన నియమ నిబంధనలు, వాడాల్సిన మందులపై విస్తృత ప్రచారం కల్పించాలని సూచించారు. ప్రపంచ ఎయిడ్స్ నియంత్రణ దినోత్సవాన్ని పురస్కరించుకొని నిర్వహించిన పలు రకాల పోటీల్లో ప్రతిభ కనబరిచిన వారికి డాక్టర్ సుధాకర్ నాయక్, డాక్టర్ అరుణశ్రీ , ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ వేదవ్యాస్ చేత ప్రశంసాపత్రాలు అందజేశారు. అనంతరం కార్యక్రమంలో పాల్గొన్న వారితో ప్రతిజ్ఞ చేయించారు.. ఈ కార్యక్రమంలో నర్సింగ్ సూపరింటెండెంట్ అరుణ, డిప్యూటీ డెమో వెంకటేశ్వర్లు, కాసిపేట పిహెచ్సి వైద్య అధికారి దివ్య, తాళ్లపేట పిహెచ్సి అల్లాడి శ్రీనివాస్, హెల్త్ ఎడ్యుకేటర్,  దిశా క్లస్టర్ ప్రోగ్రాం మేనేజర్ రమేష్, స్వచ్చంద సంస్థ, లింకేవర్కర్ స్కీమ్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు..

Post bottom