Telugu Updates
Logo
mobile after logo

వైద్యో నారాయణో హరిః’ అన్న దానికి నిదర్శనం డాక్టర్ శ్రీశైలం

మాత ఆసుపత్రిలో అరుదైన వైద్య చికిత్స.. పాప ప్రాణాలు కాపాడిన డాక్టర్ శ్రీశైలం

ఆంజనేయులు న్యూస్, మంచిర్యాల జిల్లా: వైద్యో నారాయణో హరిః’ అంటారు. వైద్యులు ఆ భగవంతుడితో సమానం అని అర్థం. ఎందుకంటే ప్రాణం పోసేది భగవంతుడు అయితే.. ఆ ప్రాణాలను కాపాడే శక్తి ఒక్క డాక్టర్‌కే ఉంటుంది. ఎవరైనా ప్రాణాపాయంలో ఉన్న వ్యక్తిని కాపాడితే.. ఆ వైద్యులను బాధిత వ్యక్తులు దేవుడికంటే ఎక్కువగా కొలుస్తారు. అందుకు నిదర్శనమే ఈ సంఘటన.. అరుదైన వ్యాధితో బాధపడుతున్న మంచిర్యాల జిల్లా చెన్నూర్ మండలం సోమనపల్లికి చెందిన మూడేండ్ల బాలిక రిత్విక కు నాలుగు రోజులుగా జ్వరంతో పాటు ఫిట్స్ వచ్చింది. దీంతో తల్లిదండ్రులు పలు దవాఖానలకు తీసుకెళ్లగా ప్రాణాపాయం వంటి సమస్యలు రావచ్చని, వయసురీత్యా చిన్న పాప అవ్వడంతో వైద్యం చేయడానికి కూడా వైద్యులు ముందుకు రాలేక పోయారు. ఎవరూ కూడా చికిత్స అందించేందుకు ముందుకు రాలేదు.. అటువంటి సమయంలో మంచిర్యాలలోని మాత శిశు ఆస్పటల్ వైద్యులు డాక్టర్ శ్రీశైలం ను సంప్రదించారు.. పాప పరిస్థితిని పూర్తిగా విశ్లేషించిన డాక్టర్ ఈ కఠిన పరిస్థితుల్లో అడ్మిట్ చేసుకొని వైద్యం కొనసాగించారు. చాలాసార్లు ఫిట్స్ రావడంతో కొమాలోకి వెళ్లిన బాలికకు వెంటిలేటర్ పై ఉంచి, ఆక్సిజన్ అందించి డాక్టర్ శ్రీశైలం, ఆయన బృందం పది రోజుల పాటు నిరంతర చికిత్స అందించారు. ప్రస్తుతం పాప పూర్తిగా కోలుకొని మాములు స్థితికి రావడంతో డిశ్చార్జి చేశారు..

ఈ సందర్భంగా డాక్టర్ శ్రీ శైలం మాట్లాడుతూ.. పాప తల్లిదండ్రుల పేదరికాన్ని దృష్టిలో ఉంచుకుని మందులు మినహా దవాఖానలో అన్ని పరీక్షలు ఉచితంగా అందించినట్లు ఆయన వెల్లడించారు. అలాగే తమ దగ్గరికి వచ్చి పేషంట్లందరూ పలు హాస్పటల్లో తిరిగి వైద్యం తగ్గని పరిస్థితులలో నన్ను సంప్రదిస్తారని అలాగే ఏ వైద్యుడు కూడా ప్రాణాలు తీయరని రోగి శరీరం వైద్యానికి సహకరించనప్పుడు మాత్రమే కొన్ని రిస్క్ అవుతాయని అన్నారు.. రోగుల ప్రాణాలు కాపాడే పవిత్రమైన వైద్య వృత్తిలో కొనసాగుతున్నామని. దేశాన్ని కాపాడుతున్న సైనికులు, పోలీసులు తర్వాత ఆ స్థానంలో వైద్యులు ఉన్నారు. కరోనా సమయంలో బంధువులు కూడా దగ్గరకు రాలేదు. అలాంటిది మా వైద్యులు రక్షణగా నిలిచి కాపాడారు. కులం, మతం అని చూడకుండా డాక్టర్లు సేవ చేస్తున్నారని అన్నారు.. వైద్య వృత్తిలో కొనసాగుతున్నది సంపాదన కోసం కాకుండా ఎలాంటి విపత్కర పరిస్థితుల్లో అయినా సరే సేవా భావంతో పేద రోగులకు వైద్యసేవలు అందిస్తానని ఆయన తెలిపారు. పాప ప్రాణాలు కాపాడిన డాక్టర్ శ్రీశైలం కు, దవాఖాన సిబ్బందికి ఆ తల్లిదండ్రులు కృతజ్ఞతలు తెలిపారు. వైద్యుడిని ప్రాణం పోసిన దేవుడిగా పోలుస్తూ కీర్తిస్తున్నారు. ‘వైద్యో నారాయణో హరిః’ అన్న దానికి నిదర్శనంగా నిలిచారని కొనియాడుతున్నారు..

Post bottom