Thursday, July 2, 2026
HomeTelanganaబాధిత కుటుంబాన్ని పరామర్శించిన: డీఎస్పీ శ్రీనివాస్

బాధిత కుటుంబాన్ని పరామర్శించిన: డీఎస్పీ శ్రీనివాస్

Post Midle

ఆంజనేయులు న్యూస్, కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా: వాంకిడి మండలంలోని ఖానాపూర్ గిరిజన గ్రామాన్ని మంగళవారం డీఎస్పీ శ్రీనివాస్ పర్యటించి. ఇటీవల పులిదాడిలో మృతి చెందిన గిరిజన రైతు సీడాం భీము కుటుంబాన్ని పరామర్శించారు. జిల్లా ఎస్పీ కే. సురేష్ కుమార్ ఆదేశాల మేరకు మృతుడి కుటుంబానికి రూ. 5వేలు ఆర్థిక సహాయంతో పాటు ఒక క్వింటాలు బియ్యం, నిత్యవసర సరకులు అందించి మాట్లాడుతూ. వాంకిడి పరిసర అటవీ ప్రాంతంలో పులి సంచరిస్తుందని, అటవీ ప్రాంతం వైపు ఉన్న గ్రామల వారు జాగ్రత్తగా ఉండాలని, వ్యవసాయ పొలాలకు వెల్లే రైతులు ఒంటరిగా వెళ్లకుండా గుంపులుగా వెళ్లాలని ఆసిఫాబాద్ డిఎస్పీ శ్రీనివాస్ గ్రామస్థులకు సూచించారు. ఈ కార్యక్రమంలో వాంకిడి సీఐ శ్రీనివాస్, ఎస్సై దీకొండ రమేష్, కెరమేరి ఎస్సై వెంకటేష్, చౌపన్ గూడ సర్పంచ్ సీడాం అన్నిగా పాల్గొన్నారు.

Post bottom
RELATED ARTICLES

Most Popular

App Icon

Install ANJ News App

Add to home screen for faster loading and latest updates.