Wednesday, August 19, 2026
HomeTelanganaమంచిర్యాల ఆర్టీసీ డిపోలో రక్తదాన శిబిరం

మంచిర్యాల ఆర్టీసీ డిపోలో రక్తదాన శిబిరం

📰 Generate e-Paper Clip

మంచిర్యాల జిల్లా: ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ లో భాగంగా శనివారం ఇండియన్ లో రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో మంచిర్యాల ఆర్టీసీ డిపోలో రక్తదాన శిబిరం నిర్వహించారు. డిపో మేనేజర్ రవీంద్రనాథ్ ప్రారంభించిన ఈ శిబిరంలో 55 మంది ఆర్టీసీ ఉద్యోగులు స్వచ్చందంగా రక్తదానం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దాతలు అందించిన రక్తం ప్రాణాపాయ స్థితిలో ఉన్న ఎంతోమందికి పునర్జన్మ ప్రసాదిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో బస్టాండ్ మేనేజర్ చంద్రమౌళి, కార్గో సర్వీస్ ఇంచార్జి అశోక్ రావు, సెక్యూరిటీ ఇంచార్జ్ సురేందర్రావు, సూపరింటెండెంట్ శంకర్, రెడ్ క్రాస్ జిల్లా శాఖ చైర్మన్ కె భాస్కర్ రెడ్డి, స్టేట్ ప్యాట్రన్ మెంబర్, బ్లడ్ బ్యాంక్ ఇన్చార్జి మధుసూదన్ రెడ్డి, జిల్లా శాఖ కార్యవర్గ సభ్యుడు సత్య పాల్ రెడ్డి, రక్తనిధి కేంద్రం సిబ్బంది మాధవి, స్వరూప, మణికంఠ, తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install Anjaneyulu News APP App

Add to home screen for faster loading and latest updates.