Friday, November 20, 2026
HomeTelanganaమంచిర్యాలఆంజనేయులు న్యూస్ కథనానికి స్పందన.. రంగంలోకి దిగిన ట్రాఫిక్ పోలీసులు!

ఆంజనేయులు న్యూస్ కథనానికి స్పందన.. రంగంలోకి దిగిన ట్రాఫిక్ పోలీసులు!

📰 Generate e-Paper Clip

మంచిర్యాల, నవంబర్ 19, ( ఆంజనేయులు న్యూస్ )

మంచిర్యాల పట్టణంలోని ఐబీ చౌరస్తా సమీపంలో హైవేను ఆనుకుని ఉన్న గల్లీ రహదారిపై పార్కింగ్ సమస్యపై ఆంజనేయులు న్యూస్‌లో ప్రచురితమైన కథనానికి ట్రాఫిక్ పోలీసులు స్పందించారు. గల్లీ రహదారికి ఇరువైపులా కాలేజీ, ఆసుపత్రులకు వచ్చే వారు వాహనాలు నిలిపివేస్తుండటంతో కాలనీవాసులు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న విషయాన్ని ఆంజనేయులు న్యూస్ కథనం ద్వారా వెలుగులోకి తీసుకువచ్చింది. ఈ నేపథ్యంలో స్పందించిన పట్టణ ట్రాఫిక్ సీఐ వెంటనే చర్యలు చేపట్టాలని ఆదేశించడంతో ఎస్‌ఐ రాములు ఆధ్వర్యంలో ట్రాఫిక్ పోలీసులు రంగంలోకి దిగి తనిఖీలు నిర్వహించారు. రహదారిపై వాహనాలు నిలిపిన వారిపై చర్యలు తీసుకున్నారు. ట్రాఫిక్ పోలీసుల తక్షణ స్పందనపై కాలనీవాసులు హర్షం వ్యక్తం చేస్తూ అభినందనలు తెలిపారు. అయితే ఈ సమస్యకు తాత్కాలిక పరిష్కారంతో సరిపెట్టకుండా ప్రతిరోజూ క్రమం తప్పకుండా తనిఖీలు నిర్వహించాలని కాలనీవాసులు కోరుతున్నారు. రోడ్డుపై వాహనాలు నిలిపే విధానాన్ని పూర్తిగా అరికట్టి గల్లీ రహదారిపై రాకపోకలు సాఫీగా సాగేలా చూడాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ప్రజల ఇబ్బందులను గుర్తించి స్పందించిన ట్రాఫిక్ పోలీసులకు స్థానికులు కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install Anjaneyulu News APP App

Add to home screen for faster loading and latest updates.