Wednesday, August 19, 2026
HomeTelanganaప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి పథకాలను పకడ్బంధీగా అమలు చేయాలి

ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి పథకాలను పకడ్బంధీగా అమలు చేయాలి

📰 Generate e-Paper Clip

జిల్లా అదనపు కలెక్టర్ మధుసూదన్ నాయక్

మంచిర్యాల జిల్లా: ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి పథకాలను అన్ని శాఖల సమన్వయంతో పకడ్బంధీగా అమలు చేయాలని జిల్లా అదనపు కలెక్టర్ మధుసూదన్ నాయక్ అన్నారు. శనివారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ భవన సమావేశ మందిరంలో జిల్లాలోని కాసిపేట, దండేపల్లి, లక్షెట్టిపేట మండలాల పంచాయతీ కార్యదర్శులు, ఉపాధి సిబ్బందితో సమీక్ష సమావేశం నిర్వహించారు..

ఈ సందర్భంగా జిల్లా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ.. ఆయా మండలాల అధికారులు, గ్రామపంచాయతీల కార్యదర్శులు వారి పరిధిలో కేటాయించిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల లక్ష్యాలను పూర్తి స్థాయిలో సాధించి జిల్లాలోనే ముందంజలో ఉండే విధంగా కృషి చేయాలని తెలిపారు. పల్లె ప్రగతి కార్యక్రమాన్ని పకడ్బందీగా అమలు చేయాలని, పారిశుద్ధ్యం విషయంలో ప్రత్యేక దృష్టి సారించాలని, గ్రామాలన్ని పరిశుభ్రంగా ఉండే విధంగా ప్రతి రోజు కార్యచరణ ప్రకారంగా కార్యక్రమాలు చేపట్టాలని, త్రాగునీటి పైప్లన్ లీకేజీలను అరికట్టడంతో పాటు చేతి పంపులు, త్రాగునీటి బావుల చుట్టూ నీటి నిల్వ లేకుండా చర్యలు తీసుకోవాలని తెలిపారు. గ్రామాలన్నీ పచ్చదనంతో నిండాలని, మొక్కలు నాటి సంరక్షించడంలో ప్రతి ఒక్కరిని భాగస్వామ్యులను చేయాలని తెలిపారు. ప్రతి మండలం పరిధిలోని 10 ఎకరాలలో ఏర్పాటు చేసిన బృహత్ పల్లెప్రకృతి వనాలలో నాటిన మొక్కల సంరక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని తెలిపారు. మన ఊరు. మన బడి కార్యక్రమంలో – భాగంగా మొదటి విడతలో ఎంపికైన పాఠశాలల్లో చేపట్టిన అభివృద్ధి పనులను నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని తెలిపారు. అనంతరం అభివృద్ధి కార్యక్రమాలలో అమలులో ప్రత్యేక శ్రద్ధ కనబరిచిన వారిని శాలువాతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install Anjaneyulu News APP App

Add to home screen for faster loading and latest updates.