Friday, October 2, 2026
HomeTelanganaగాంధీ జయంతి వేళ.. స్వచ్ఛత సైనికులకు విద్యార్థుల అభివందనం

గాంధీ జయంతి వేళ.. స్వచ్ఛత సైనికులకు విద్యార్థుల అభివందనం

📰 Generate e-Paper Clip

పారిశుద్ధ్య కార్మికులను ఘనంగా సన్మానించిన ఎథిక్ అకాడమీ విద్యార్థులు

మంచిర్యాల అక్టోబర్ 1, ( ఆంజనేయులు న్యూస్ )

గాంధీ జయంతిని పురస్కరించుకుని సత్యం, అహింస, శాంతి, పరిశుభ్రత వంటి మహాత్మా గాంధీజీ ఆశయాలను విద్యార్థులకు పరిచయం చేస్తూ మంచిర్యాల పట్టణం జన్మభూమి నగర్‌లోని ఎథిక్ అకాడమీ – ది ఎలిమెంటరీ స్కూల్‌లో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్‌కు చెందిన పారిశుద్ధ్య కార్మికులను విద్యార్థులు ఘనంగా సన్మానించారు. గాంధీజీ కలలుగన్న పరిశుభ్రమైన భారతదేశ నిర్మాణానికి కొనసాగింపుగా సాగుతున్న స్వచ్ఛ భారత్ ఉద్యమంలో పారిశుద్ధ్య కార్మికుల సేవలు ఎంతో కీలకమని విద్యార్థులకు వివరించారు. ప్రతిరోజూ నగర పరిశుభ్రత కోసం శ్రమిస్తున్న వారిని ‘స్వచ్ఛత సైనికులు’గా అభివర్ణిస్తూ చిన్నారులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ఎథిక్ అకాడమీ డైరెక్టర్ చరణ్ రెడ్డి మాట్లాడుతూ, “స్వచ్ఛ భారత్ కేవలం ఒక కార్యక్రమం కాదు.. ప్రతి పౌరుడి బాధ్యత. మన నగరాన్ని పరిశుభ్రంగా ఉంచేందుకు ప్రతిరోజూ కృషి చేస్తున్న పారిశుద్ధ్య కార్మికులను గౌరవించడం ద్వారా విద్యార్థుల్లో సేవా భావం, శ్రమకు గౌరవం, సామాజిక బాధ్యత వంటి విలువలను పెంపొందించాలనేదే మా ఉద్దేశం” అని అన్నారు. అదేవిధంగా పాఠశాలలో విద్యార్థుల సంరక్షణలో కీలక పాత్ర పోషిస్తున్న ఆయాలు, సహాయక సిబ్బందిని కూడా విద్యార్థులు ఘనంగా సన్మానించారు. “గాంధీజీ ఆశయం – స్వచ్ఛ భారత్.. స్వచ్ఛ భారత్‌కు బలం – మన పారిశుద్ధ్య కార్మికులు” అనే సందేశంతో కార్యక్రమాన్ని నిర్వహించారు.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install Anjaneyulu News APP App

Add to home screen for faster loading and latest updates.